spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna: ఆ విషయంలో కొడుకుని కూడా క్షమించను అంటూ బాలయ్య స్ట్రిక్ట్ వార్నింగ్..!

Balakrishna: ఆ విషయంలో కొడుకుని కూడా క్షమించను అంటూ బాలయ్య స్ట్రిక్ట్ వార్నింగ్..!

Balakrishna: నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ త్వరలోనే హీరో గా లాంచ్ కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా, దానికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కళ్యాణ్ రామ్ పోలికలతో మోక్షజ్ఞ ఉన్నాడని అనేకమంది అభిమానులు కామెంట్స్ చేసారు. ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ కూడా సోషల్ మీడియా ద్వారా మోక్షజ్ఞ కి శుభాకాంక్షలు తెలియచేసారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా షూటింగ్ ఎలాంటి విరామం లేకుండా శరవేగంగా సాగనుంది. ఇందులో నందమూరి బాలకృష్ణ కూడా ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్టు సమాచారం. సోషియో ఫాంటసీ నేపథ్యం లో తెరకెక్కనున్న సూపర్ హీరో చిత్రమిది. లెజెండ్ ఆర్ట్స్ క్రియేషన్స్ పై బాలయ్య కూతురు తేజస్విని ఈ సినిమాకి సహా నిర్మాతగా వ్యవహరించబోతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీలీల నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా తర్వాత మోక్షజ్ఞ తియ్యబోయే సినిమాలు కూడా బాలయ్య లాక్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. తనకు సింహా, లెజెండ్ మరియు అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను అనిందించిన బోయపాటి శ్రీను మోక్షజ్ఞ రెండవ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నట్టు తెలుస్తుంది. ఒక హీరోకి విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ రావాలంటే కచ్చితంగా బోయపాటి లాంటి దర్శకులతో సినిమా చెయ్యాలి. బాలయ్య కోసమే పుట్టినట్టు గా అనిపించే బోయపాటి అయితే తన నమ్మకాన్ని నిలబెట్టగలడని బాలయ్య బలంగా నమ్ముతున్నాడు. అందుకే రెండవ చిత్రం ఆయన చేతుల్లో పెట్టాడు. ఇక మూడవ సినిమా ప్లానింగ్ కూడా జరిగిపోయింది అట. తనతో భగవంత్ కేసరి వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తీసిన అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నట్టు టాక్. కామెడీ మరియు ఫ్యామిలీ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాని తియ్యనున్నారు. అలా మొదటి మూడు సినిమాలతోనే యూత్, మాస్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో బలమైన ఫ్యాన్ బేస్ పడే విధంగా మోక్షజ్ఞ సినీ కెరీర్ ని డిజైన్ చేసాడు బాలయ్య.

మోక్షజ్ఞ కి ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చాయి. ఇక కెరీర్ పరంగా ఆయన ఏమాత్రం అలసత్వం చూపినా క్షమించేది లేదని బాలయ్య మోక్షజ్ఞ కి చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడట. మరి మోక్షజ్ఞ బాలయ్య పెట్టుకున్న అంచనాలను రీచ్ అవుతాడా లేదా?, నందమూరి కుటుంబ లేజసి ని తన భుజాల మీద సమర్థవతంగా మోస్తాడా లేదా అనేది చూడాలి. ఇది ఇలా ఉండగా మొదటి సినిమా లాంచ్ ఈ నెలాఖరున ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ లాంచ్ ఈవెంట్ కి టాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీస్ అందరూ హాజరు అవ్వబోతున్నారని టాక్. జూనియర్ ఎన్టీఆర్ కూడా విచేయబోతున్నాడట, నందమూరి అభిమానులకు ఇది ఒక పండుగ రోజు అనే చెప్పాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Oktelugu Epaper
Exit mobile version