spot_img
Homeఅంతర్జాతీయంIndia Russian Oil Imports: రష్యా ఆయిల్‌ కొనకపోతే నష్టం ఎవరికి..?

India Russian Oil Imports: రష్యా ఆయిల్‌ కొనకపోతే నష్టం ఎవరికి..?

India Russian Oil Imports: భారత్‌–అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంతో భారత్‌పై అమెరికా టారిఫ్‌లు 18 శాతానికి తగ్గాయి. ఇక అదే సమయంలో అమెరికా భారత్‌పై మరో ఒత్తిడి పెంచింది. రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోలు తగ్గించాలని ఆదేశించింది. భారత్‌తో సంబంధం లేకుండానే డొనాల్డ్‌ ట్రంప్‌.. భారత్‌ రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోళ్లు తగ్గిస్తోందని ప్రకటించారు. అయితే దీనిపై భారత్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు. మంత్రి పీయూష్‌ గోయల్‌ మాత్రం రష్యా ఆయిల్‌ కొనుగోలు ట్రేడ్‌లో భాగం కాదని ప్రకటించారు.

తగ్గిన రష్యా ఆయిల్‌ దిగుమతి..
ఇదిలా ఉంటే భారత్‌కు రష్యా ఆయిల్‌ దిగుమతి తగ్గింది. 2024 డిసెంబర్‌తో పోల్చితే 2025లో 15% తగ్గుదల నమోదైంది. నవంబర్‌–డిసెంబర్‌ మధ్య 27% తగ్గుదల.నమోదైంది. ఇక ఇదే సమయంలో అమెరికా దిగుమతులు 31% పెరిగాయి. దీంతో భారత్‌ అమెరికా ఒత్తిడికి తలొగ్గుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

షిప్పింగ్‌ భారం మూడురెట్లు..
రష్యా, ఇరాన్‌ నుంచి బ్యారెల్‌ ఆయిల్‌ రవాణాకు షిప్పింగ్‌ చార్జి ఒక డాలర్‌ ఖర్చు అయ్యేది. అమెరికా, వెనెజువెలా నుంచి రవాణ చేయడానికి 3 నుంచి 5 డాలర్లవరకు కర్చు చేయాల్సి వస్తుంది. దీంతో భారత్‌పై రవాణా భారం మూడు రెట్లు పెరుగుతుంది. ఇక రష్యా, ఇరాన్‌ నుంచి భారత్‌ రూపాయల్లోనే ఆయిల్‌ కొనుగోలు చేస్తోంది. అమెరికా నుంచి కొనాలంటే డాలర్లలో కొనాలి. రష్యా రూపాయలను భారత్‌లోనే పెట్టుబడి పెట్టేలా రిజర్వు బ్యాంకు అవకాశం కల్పించింది. దీంతో మన దేశంలో పెట్టుబడులు పెరిగాయి.

డాలర్‌ ఒత్తిడి..
డాలర్‌లో కొనుగోళ్లు రూపాయి విలువపై ఒత్తిడి పెంచుతాయి. రష్యా వ్యవస్థ ఉపాధి అవకాశాలు, ఆర్థిక ప్రవాహాన్ని పెంచుతుంది. అమెరికా మార్పు దీర్ఘకాలిక ఖర్చులు పెంచి, ఆర్థిక సమతుల్యాన్ని భంగపరుస్తుంది.

ఆయుధాల కొనుగోలుపై ప్రభావం..
ఆయిల్‌ మార్పు భవిష్యత్‌ ఆయుధ కొనుగోళ్లలో అమెరికా ఒత్తిడికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్‌ ఆంక్షల్లా రష్యా మార్పు భారత వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని పరిమితం చేస్తుంది. చైనా, యూరప్‌ కొనుగోళ్లు కొనసాగుతుంటే భారత్ పై మాత్రమే అమెరికా ఒత్తిడి చేయడం గమనార్హం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper
Exit mobile version