spot_img
Homeక్రీడలుక్రికెట్‌Uae Vs New Zealand T20 World Cup: యూఏఈ పై కాదు.. న్యూజిలాండ్ హైయెస్ట్...

Uae Vs New Zealand T20 World Cup: యూఏఈ పై కాదు.. న్యూజిలాండ్ హైయెస్ట్ రికార్డ్ అదే.. ఏ జట్టు మీద అంటే..

Uae Vs New Zealand T20 World Cup: టి20 వరల్డ్ కప్ లో చెన్నై వేదికగా యూఏఈ జట్టుతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ ప్రపంచ రికార్డు సాధించింది. 175 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ కూడా కోల్పోకుండా సాధించింది. తద్వారా పురుషుల టి20 వరల్డ్ కప్ లో అనితర సాధ్యమైన ఘనతను అందుకుంది. న్యూజిలాండ్ సాధించిన ఈ రికార్డు గొప్పదే అయినప్పటికీ.. అంతకుమించిన స్థాయిలో కివీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది.

2020 సంవత్సరంలో మౌంట్ మౌంగనూయ్ వేదికగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటర్లు డేవిడ్ కాన్వే, ఫిలిప్స్ 184 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టి20 చరిత్రలో న్యూజిలాండ్ తరఫున ఇది హైయెస్ట్ రికార్డ్. 2016లో మార్టిన్ గఫ్టిల్, విలియంసన్ పాకిస్తాన్ జట్టుపై 171* పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

టి20 వరల్డ్ కప్ లో 10 వికెట్ల విజయాలు

2007లో కేప్ టౌన్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

2012లో హంబంటోటా వేదికగా జరిగిన మ్యాచ్లో జింబాబ్వే మీద సౌత్ ఆఫ్రికా 10 వికెట్ల తేడాతో గెలుపు అందుకుంది.

2021లో ఆల్ అమేరాట్ వేదికగా పప్పుగా న్యూగీనియా జట్టు తో జరిగిన మ్యాచ్లో ఒమన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

2021లో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇండియా పై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

2022లో అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇండియా పై ఇంగ్లాండ్ పది వికెట్ల తేడాతో ఘనవిజయం అందుకుంది.

2024లో బ్రిడ్జ్ టౌన్ వేదికగా అమెరికాలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ పది వికెట్ల తేడాతో గెలుపును సాధించింది.

2026 లో చెన్నై వేదికగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 150 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా సాధించింది.

2024 లో నార్త్ సౌండ్ వేదికగా ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో స్కాట్లాండ్ 151 పరుగుల లక్ష్యాన్ని మరో 41 బంతులు మిగిలి ఉండగానే చేసింది.

ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో నెదర్లాండ్ 190 పరుగుల లక్ష్యాన్ని 37 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. 2014లో ఈ మ్యాచ్ జరిగింది.

ఒక వికెట్ కూడా కోల్పోకుండా

పురుషులు టి20 లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 150 కంటే ఎక్కువ లక్ష్యాలను చేదించిన జాబితాలో పాకిస్థాన్ ముందు వరుసలో ఉంది.

2022లో కరాచీ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 200 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసింది…

2026లో చెన్నై వేదికగా యూఏఈ జట్టుతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 174 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా పూర్తి చేసింది.

2016లో హామీల్టన్ వేదికగా పాకిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 169 లక్ష్యాన్ని పూర్తి చేసింది.

2022లో ఆడిలైట్ వేదికగా ఇండియాతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 169 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా పూర్తి చేసింది.

2024 లో హరారే వేదికగా జింబాబ్వే జట్టుతో జరిగిన మ్యాచ్లో ఇండియా 153 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా పూర్తి చేసింది.

2021లో దుబాయ్ వేదికగా ఇండియాతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 152 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ కూడా కోల్పోకుండా విజయవంతంగా పూర్తి చేసింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Oktelugu Epaper
Exit mobile version