Homeఅంతర్జాతీయంIndians Jailed Abroad: నిమిష ప్రియ మాత్రమే కాదు.. విదేశాల్లో అలాంటి భారతీయులు చాలామంది.....

Indians Jailed Abroad: నిమిష ప్రియ మాత్రమే కాదు.. విదేశాల్లో అలాంటి భారతీయులు చాలామంది.. గుండె తరుక్కుపోయే కథనం ఇది

Indians Jailed Abroad: ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేక ఒకరు.. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాక ఇంకొకరు.. పేదరికాన్ని జయించాలని.. నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ఇంకొకరు.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. వీరందరి సమస్యలకు పరిష్కారం ఒకటే డబ్బు. ఆ డబ్బు సంపాదించాలని వీరంతా తమ తమ మార్గాలను చూసుకున్నారు. కొందరు తెలిసిన వారి ద్వారా.. ఇంకొందరు కన్సల్టెన్సీల ద్వారా.. మరికొందరు స్నేహితుల ద్వారా ఆయా దేశాలకు వెళ్లారు. అక్కడ ఒళ్ళు వంచి పని చేయడం మొదలుపెట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. తాము ఒకటి తలిస్తే.. దైవం మరొకటి
తలవడంతో నరకం చూస్తున్నారు.

Also Read: TDP MLA survey results: ఆ 72 చోట్ల డేంజర్ జోన్ లో ఎమ్మెల్యేలు.. సంచలన సర్వే!

యెమెన్ దేశంలో ఒక పౌరుడి మరణానికి కారణమైనదని అక్కడి న్యాయస్థానం మన దేశ నర్స్ నిమిషప్రియకి మరణశిక్ష విధించింది. ఈ శిక్ష రద్దు కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్రం ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. యెమెన్ దేశంలో షరియా చట్టం అమల్లో ఉంటుంది. ఆ చట్టం న్యాయస్థానానికి కూడా వర్తిస్తుంది. ఆ చట్టం ప్రకారమే అక్కడి న్యాయస్థానాలు తీర్పులు చెబుతుంటాయి. యెమెన్ దేశంలో ఒక పౌరుడి హత్యకు కారణమైందని భావిస్తూ నిమిషప్రియ మీద అక్కడి పోలీసులు అభియోగాలు మోపారు. వాటిని కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు.. వాదనలు విన్న అక్కడి కోర్టు నిమిషప్రియకు మరణ దండన విధించింది. అయితే ఈ మరణదండన ఆపడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికైతే అన్నీ దారులు మూసుకుపోయినప్పటికీ.. ఏదో ఒక అవకాశం దొరక్కపోదా అనుకుంటూ ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.

నిమిష ప్రియకు మరణ దండన విధించిన నేపథ్యంలో దేశంలో సరికొత్త చర్చ మొదలైంది. విదేశాల్లోని జైల్లో ఉన్న భారతీయులపై చర్చి నడుస్తోంది. పార్లమెంటు సమర్పించిన వివరాల ప్రకారం మార్చి 2023 వరకు సౌదీ అరేబియాలో 2,633 మంది భారతీయులు జైల్లో ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఏమిరైట్స్ లో 2,518, నేపాల్ దేశంలో 1,317, ఖతార్ దేశంలో 611, కువైట్లో 387, మలేషియాలో 338, ఇంగ్లాండ్లో 288, పాకిస్థాన్లో 266 మంది భారతీయులు జైల్లో ఉన్నారు.

Also Read: Pawan Movies vs Politics: సినిమాలు.. రాజకీయం.. పవన్ పెద్ద స్కెచ్

ఇక 2020 నుంచి 24 వరకు వివిధ దేశాలలో జైల్లో ఉన్న భారతీయ ఖైదీలు 47 మందికి ఉరిశిక్ష అమలు చేశారు. ప్రస్తుతం నిమిష ప్రియ కు మరణ దండన విధించిన నేపథ్యంలో దేశంలో సరికొత్త చర్చ నడుస్తోంది. నిమిషప్రియకు మరణశిక్షను రద్దు చేయాలని డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై యెమెన్ ప్రభుత్వంతో భారత ప్రభుత్వ పెద్దలు సంప్రదింపులు జరిపినప్పటికీ ఉపయోగం లేకుండా పోయాయి. పైగా ప్రస్తుతం నిమిషప్రియను కాపాడేందుకు ఏకంగా ఒక సంస్థ ఏర్పాటయింది. ఆ సంస్థ ఆధ్వర్యంలో నిమిష ప్రియ మరణ దండనను రద్దు చేయాలని ఉద్యమాలు నడుస్తున్నాయి. అయినప్పటికీ యెమెన్ ప్రభుత్వం ఏమాత్రం తగ్గడం లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular