TDP MLA survey results: ఏపీలో కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకుంది. గత ఏడాది జూన్ లో అధికారం చేపట్టింది కూటమి ప్రభుత్వం. ప్రభుత్వపరంగా పరవాలేదనిపించుకుంది కానీ.. ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం వ్యతిరేకత ఉన్నట్లు అనేక సర్వేల్లో వెల్లడయ్యింది. గతంలో టిడిపికి అనుకూలంగా సర్వేలు ఇచ్చిన సంస్థలు సైతం ఇదే తేల్చి చెప్పాయి. ప్రభుత్వ పెద్దలు బాగానే పనిచేస్తున్నారని.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు మాత్రం బాగాలేదని తేల్చి చెప్పాయి. ఇప్పుడు తాజాగా మరో సర్వే సంస్థ ఫలితాలను వెల్లడించింది. జిల్లాల వారీగా పరిస్థితిని వివరించే ప్రయత్నం చేసింది. ప్రతి నియోజకవర్గంలో 450 వరకు శాంపిళ్లను సేకరించారు హైదరాబాదులోని ఐఐటి నిపుణులు. తాజాగా ఈ సర్వే ఫలితాలను జిల్లాల వారీగా వెల్లడించారు.
1. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 సీట్లు ఉన్నాయి. 8 చోట్ల టిడిపి విజయం సాధించింది. ఒకచోట జనసేన, మరోచోట బిజెపి గెలిచింది. అయితే టిడిపి రెండు చోట్ల, బిజెపి ఒకచోట ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి. మరో మూడు చోట్ల టిడిపి ఎమ్మెల్యేలు అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు.
2. ఉమ్మడి విజయనగరంలో 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. టిడిపి గెలిచిన 8 సీట్లలో నలుగురు ఎమ్మెల్యేలు ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఒకచోట మాత్రం ఓ ఎమ్మెల్యే పై అసంతృప్తి కనిపిస్తోంది. జనసేన గెలిచిన ఒకే చోట ప్రజా వ్యతిరేకత ఉంది.
3. ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. టిడిపి గెలిచిన 8 సీట్లలో ఒకచోట మాత్రం ప్రజా వ్యతిరేకత ఉంది. మరో రెండు చోట్ల అసంతృప్తి వ్యక్తం అవుతోంది. జనసేన గెలిచిన నాలుగు సీట్లలో రెండింటిలో వ్యతిరేకత, మరోచోట అసంతృప్తి ఉంది.
4. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టిడిపి గెలిచిన 13 సీట్లలో.. నాలుగు చోట్ల ప్రజా వ్యతిరేకత ఉంది. రెండు చోట్ల మాత్రం అసంతృప్తి వ్యక్తం అవుతోంది. జనసేన గెలిచిన ఐదు సీట్లలో నాలుగు చోట్ల వ్యతిరేకత ఉంది. బిజెపి గెలిచిన ఒక్క సీటులో అసంతృప్తి మాత్రమే ఉంది.
5. ఉమ్మడి పశ్చిమగోదావరిలో టిడిపి గెలిచిన 9 సీట్లలో మూడింట వ్యతిరేకత ఉంది. జనసేన గెలిచిన 6 సీట్లలో మూడు చోట్ల వ్యతిరేకత.. మరో రెండింట అసంతృప్తి ఉంది.
Also Read: Pawan Movies vs Politics: సినిమాలు.. రాజకీయం.. పవన్ పెద్ద స్కెచ్
6. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టిడిపి గెలిచిన 13 సీట్లలో ఏడింట వ్యతిరేకత ఉంది. మరో రెండు చోట్ల అసంతృప్తి కనిపిస్తోంది.
7. గుంటూరు జిల్లాలో టిడిపి గెలిచిన 16 సీట్లలో ఆరింట వ్యతిరేకత ఉంది. మరో రెండు చోట్ల అసంతృప్తి ఉంది. జనసేన గెలిచిన ఒక్క సీటులో సైతం వ్యతిరేకత కనిపిస్తోంది.
8. ప్రకాశం జిల్లాలో టిడిపి గెలిచిన 10 సీట్లలో నాలుగింట వ్యతిరేకత, మరో రెండు సీట్లలో అసంతృప్తి ఉంది.
9. కడప జిల్లాలో టిడిపి గెలిచిన ఐదింట మూడు సీట్లలో వ్యతిరేకత.. మరో సీటులో అసంతృప్తి కనిపిస్తోంది. జనసేనతో పాటు బిజెపి గెలిచిన చోట్ల వ్యతిరేకత ఉంది.
10. కర్నూలు జిల్లాలో టిడిపి గెలిచిన 11 సీట్లలో ఐదింట వ్యతిరేకత ఉంది. రెండు సీట్లలో అసంతృప్తి కనిపిస్తోంది. బిజెపి గెలిచిన స్థానంలో కూడా వ్యతిరేకత ఉంది.
11. అనంతపురంలో టిడిపి గెలిచిన 13 సీట్లలో ఆరింట వ్యతిరేకత ఉంది. మరో సీట్లో అసంతృప్తి కనిపిస్తోంది. బిజెపి గెలిచిన ఒక్క సీటులోనూ వ్యతిరేకత ఉంది.
12. చిత్తూరులో టిడిపి గెలిచిన 11 సీట్లలో ఐదు సీట్లలో వ్యతిరేకత ఉంది. మరో రెండు సీట్లలో అసంతృప్తి ఉంది. జనసేన గెలిచిన ఒక్క సీటులోనూ వ్యతిరేకత కనిపిస్తోంది. ఇలా రాష్ట్రంలో మొత్తం 72 సీట్లలో కూటమి పార్టీల పట్ల వ్యతిరేకత.. మరో 26 సీట్లలో అసంతృప్తి వ్యక్తం అయింది. రెడ్ జోన్ లో టిడిపికి చెందిన 54 మంది, జనసేనకు చెందిన 14 మంది, బిజెపికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆరెంజ్ జోన్లో టిడిపికి చెందిన 22 మంది, జనసేన కు చెందిన ముగ్గురు, బిజెపికి చెందిన ఒక ఎమ్మెల్యే ఉన్నారు. గ్రీన్ జోన్లో మాత్రం టిడిపి నుంచి 59 మంది, జనసేనకు చెందిన నలుగురు, బిజెపికి చెందిన ముగ్గురు ఉన్నారు. వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంత్రుల్లో నాదేండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, సత్య కుమార్ యాదవ్, ఫరూక్, పార్థసారథి, గుమ్మిడి సంధ్యారాణి, టీజీ భరత్, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ ఉన్నారు. అసంతృప్తి ఎదుర్కొంటున్న మంత్రుల జాబితాలో వంగలపూడి అనిత, కందుల దుర్గేష్, సవిత ఉన్నారు.