Modi Russia Visit: రష్యా సైన్యంలో భారతీయులు.. కీలక ప్రకటన చేసిన దౌత్యవేత్త.. మోదీ పర్యటన వేళ కీలక పరిణామం

ఉద్యోగాలు, ఉపాధి పేరుతో ఏజెంట్లు టూరిస్టు వీసాలపై భారతీయులను రష్యాకు తీసుకువస్తున్నట్లు బాబుష్కీన్‌ తెలిపారు. అక్కడకు వెళ్లాక వారిని రష్యా సైన్యంలో చేరుస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో ఇరు దేశాలు దర్యాప్తు చేసి సమస్యకు త్వరలోనే పరిష్కారం కనుక్కొంటామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై భారత్, రష్యా ఒకే ఆలోచనతో ఉనానయని తెలిపారు.

Written By: Raj Shekar, Updated On : July 11, 2024 8:10 am

Modi Russia Visit

Follow us on

Modi Russia Visit: భారతీయులు రష్యా సైన్యంలో భాగం కావాలని తాము ఎప్పుడూ కోరుకోలేదని భారత్‌లోని రష్యా దౌత్యవేత్త రోమన్‌ బాబుష్కీన్‌ తెలిపారు. భారత ప్రధాని నరేంద్రమోదీ రష్యా పర్యటన ముగిసిన నేపథ్యంలో బుధవారం(జూన్‌ 10న) బాబుష్కీన్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రష్యా సైన్యంలో భారతీయుల చేరికపై కీలక వ్యాఖ్యలు చేశారు.

టూరిస్టు వీసాపై వెళ్లి..
ఉద్యోగాలు, ఉపాధి పేరుతో ఏజెంట్లు టూరిస్టు వీసాలపై భారతీయులను రష్యాకు తీసుకువస్తున్నట్లు బాబుష్కీన్‌ తెలిపారు. అక్కడకు వెళ్లాక వారిని రష్యా సైన్యంలో చేరుస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో ఇరు దేశాలు దర్యాప్తు చేసి సమస్యకు త్వరలోనే పరిష్కారం కనుక్కొంటామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై భారత్, రష్యా ఒకే ఆలోచనతో ఉనానయని తెలిపారు. ఈ నేపథ్యంలో త్వరలోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని రాజకీయం చేయాలని అనుకోవడం లేదని చెప్పారు.

డబ్బుల కోసమే ఆర్మీలోకి..
భారతీయులను రష్యా సైన్యంలో చేర్చుకోవాలని తాము ఎప్పుడూ భావించలేదని తెలిపారు. తమ అధికారులకు కూడా ఈ ఆలోచన లేదన్నారు. భారతీయులే ఉపాధి కోసం రష్యాకు వచ్చి.. డబ్బుల కోసం ఆర్మీలో చేరుతున్నారని తెలిపారు. అలాంటివారిని తాము ఎట్టిపరిస్థితుల్లో ఆర్మీలో చేర్చుకోమన్నారు. కేవలం 50 నుంచి 100 మంది భారతీయులు మాత్రమే రష్యా సైన్యంలో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇది అంత ప్రభావం చూపే విషయం కాదని చెప్పారు. రష్యా ఆర్మీలో సహాయకులుగా చేరుతున్న భారతీయులకు సరైన వీసాలు కూడా లేవని తెలిపారు. టూరిస్టు వీసాపై వచ్చినవారే ఆర్మీలో చేరారని వెల్లడించారు.

భారతీయుల విడుదలకు మోదీ వినతి..
ఇదిలా ఉంటే.. రెండు రోజుల రష్యా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో డిన్నర్‌ మీట్‌లో రష్యా సైన్యంలో ఉన్న భారతీయులను స్వదేశానికి పంపించాలని పుతిన్‌ను కోరారు. ఇందుకు పుతిన్‌ కూడా సానుకూలంగా స్పందించారు. భారతీయులను విడుదల చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో రష్యా దౌత్యవేత్త రోమన్‌ బాబుష్కీన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.