Site icon OkTelugu

Pakistan missile threat US: ఆ పెంపుడు కుక్కతోనే అమెరికాకు అణుముప్పు.. ఇంటెలిజెన్స్‌ సంచలన నివేదిక..

Pakistan missile threat US

Pakistan missile threat US

Pakistan missile threat US: పెంపుడు కుక్కతో అమెరికాకు అణుముప్పు ఏంటి అని ఆలోచిస్తున్నారా.. పెంపుడు కుక్క అంటే పెంపుడు దేశం అన్నమాట. సాధారణంగా అమెరికా వెన్నులో వణుకు పుట్టిస్తున్న దేశం ఏది.. అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న దేశం ఏది.. అమెరికాపై అణ్వాయుధాలతో దాడిచేయబోతున్న దేశం ఏది.. అంటే చాలా మంది రష్యా, చైనా, నార్త్‌ కొరియా అంటారు. కానీ ఇవేవీ కావు. ఆ దేశం మరొకటి. అమెరికాతో సన్నిమితంగానే ఉంటుంది. కానీ ఆ దేశమే భవిష్యత్‌లో అణ్వాయుధాలతో అమెరికాపై దాడిచేసే అవకాశ ఉంది. ఈ విషయాన్ని అమెరికా డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ తులసీ గబ్బార్డ్‌ తెలిపారు. అమెరికన్‌ సెనేట్‌ ప్యానెల్‌ హియరింగ్‌లో ఈ విషయాన్ని అధికారికంగా లిఖితపూర్వకంగా ఇచ్చిన నివేదికలో ఆ దేశం పేరు తెలిపింది. ఆ దేశమే పాకిస్తాన్‌. పాకిస్తాన్‌ అమెరికా పాలిట బస్మాసుర హస్తంగా మారింది. ఎక్కడ చేయి పెట్టినా ఆందకపోవడంతో చివరకు అమెరికాపైనే చేయి పెట్టే అవకాశం ఉందని తులసి గబ్బార్డ్‌ తెలిపారు. ఈ నివేదికపై నమ్మకం ఉందని అమెరికా వైట్‌హౌస్‌ తెలిపింది.

ఐదు దేశాల నుంచి ముప్పు..
ఇంటెలిజెన్స్‌ నివేదికలో అమెరికాకు ఐదు దేశాల నుంచి ముప్పు ఉంది. మొదటిది రష్యా. రెండోది చైనా.. చైనా నంబర్‌ వన్‌ కాడానికి అమెరికాను దెబ్బకొట్టాలని చూస్తోంది. ఇప్పటికే అమెరికా చుట్టూ ఉన్న దేశాల్లో సైన్యాన్ని మోహరిస్తోంది. ఇక తర్వాత అమెరికాను భయపెడుతున్న దేశం ఉత్తరకొరియా, నాలుగో దేశం ఇరాన్‌. అయితే ఇరాన్‌పై 2025 జూన్‌లో జరిపిన దాడిలో ఇరాన్‌ అణు కార్యక్రమాలు నిలిపేసిందిన తులసీ గబ్బార్డ్‌ పేర్కొన్నారు. అయినా అమెరికా తాజాగా యుద్ధం చేస్తోంది. ఇక ఐదో దేశం పాకిస్తాన్‌.

పాకిస్తాన్‌కు అణు సామర్థ్యం…
పాకిస్తాన్‌ వద్ద ప్రస్తుతం 3 వేల అణు మిస్సైళ్లు ఉన్నాయి, రాబోయే సంవత్సరాల్లో 16 వేలకు పెరిగే అవకాశం ఉంది. ఈ మిస్సైళ్లలో లాంగ్‌రేంజ్‌ వాహకాలు అమెరికా మెయిన్‌ల్యాండ్‌ను చేరుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో పేలుడు పదార్థాలు, అణు ఆయుధాలు లాంచ్‌ చేసే వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. ఇది అమెరికా ’వెన్నులో వణుకు’ పుట్టించే స్థాయికి చేరింది.

అమెరికా–పాక్‌ స్నేహం..
అమెరికా పాకిస్తాన్‌ను రష్యా ప్రభావాన్ని తగ్గించడానికి, తాలిబాన్‌లు, అల్‌ఖైదా దెబ్బతీసేందుకు ఉపయోగించుకుంది. 2001 భారత పార్లమెంట్‌ దాడికి పాక్‌ పాత్ర ఉన్నా, అమెరికా మద్దతు ఇచ్చింది. ఇటీవల ఇరాన్‌ దాడులకు పాక్‌ బేస్‌లు వాడింది. ఐఎంఎఫ్‌ రుణాలు, ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌కు ఆహ్వానాలు, షెహబాజ్‌ షరీఫ్‌తో సంబంధాలు కొనసాగుతున్నాయి. చైనాకు చెక్, ఖనిజాల సేకరణ కోసం పాక్‌ను సహాయం చేస్తోంది. పాకిస్తాన్‌ ప్రత్యేకత ఏమిటంటే, అమెరికా సన్నిహిత సంబంధాలు ఉన్నా అణు సామర్థ్యం అదుపు తప్పే ప్రమాదం ఉంది.

తులసీ గబ్బార్డ్‌ పాకిస్తాన్‌ను అమెరికా వాడుకుని తొలగించుకునే పరిస్థితి రాకుండా చూడాలని హెచ్చరించారు. ఈ అణు పెరుగుదల భారత్‌కు కూడా సవాలు, ఎందుకంటే పాక్‌ భారత ఎదుగుదలను అడ్డుకోవడానికి అమెరికా సాయంతో కుట్రలు చేస్తోంది. ట్రంప్‌ పాక్‌ నాయకులను ఆహ్వానించడం విరుద్ధంగా ఉన్నా, ఈ నివేదిక భవిష్యత్‌ విధానాల్లో మార్పు తీసుకువస్తుంది. ప్రపంచ అణు సమతుల్యతకు ఇది కొత్త ఆందోళన.

Exit mobile version