https://oktelugu.com/

SUV Cars: ఎస్‌యూవీలపై భారీ డిసౌంట్‌.. ప్రకటించిన ప్రముఖ కంపెనీలు.. ఆఫర్‌ మిస్‌ చేసుకోవద్దు

భారత ఆటోమొబైల్‌ రంగంలో ప్రస్తుతం స్తబ్ధత నెలకొంది. జూన్‌ నెల రిటైల్‌ సేల్స్‌లో కేవలం రూ.073 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది. పాసింజర్, కమర్షియల్‌ వాహన విక్రయాల్లోనూ క్షీణత నమోదైంది. తఅవలో ఇన్వెంటరీ పేరుకుపోతోంది. 62–67 రోజుల ఆల్‌టైమ్‌ గరిష్టానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో కార్ల తయారీ కంపెనీలు డిస్కౌంట్లతో స్తబ్ధత తొలగించే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో డిమాండ్‌ పెరుగుతుందని భావిస్తున్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 10, 2024 / 10:10 PM IST

    SUV Cars

    Follow us on

    SUV Cars: దేశీయ ఆటోమొబైల్‌ కంపెనీలు తమ ఎస్‌యూవీలపై భారీ డిసౌంట్లు ప్రకటించాయి. ప్రముఖ కంపెనీలు అయిన టాటా మోటార్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా ఇప్పటికే వివిధ మోడళ్లపై డిస్కౌంట్లు ప్రకటించాయి. డిమాండ్ పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా తన ఎక్స్‌యూవీ 700ను మార్కెట్‌లోకి తెచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఏ7 వామన ధరలను రూ.2 లక్షల వరకు తగ్గించింది. దీంతో ఈ వాహనాల ధరలు ఇకపై రూ.19.49 లక్షల నుంచి ప్రారంభం అవుతాయి. నాలుగు నెలలు ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయని మహీంద్రా సంస్థ ప్రకటించింది. ఈ మోడల్‌ ఇప్పటికే 2 లక్షలకుపైగా కార్లను విక్రయించింది.

    టాటా మోటార్స్‌ కూడా..
    ఇక మరో ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ టాటా మోటార్స్‌ కూడా తన ఫ్లాగ్‌సిప్‌ ఎంపిక చేసిన మోడళ్లపై రూ.70 వేల వరకు డిస్కౌంట్‌ ప్రకటించింది. దీంతోపాటు రూ.1.4 లక్షల విలువైన ప్రయోజనాలు అందిస్తోంది.టాటా మోటార్స్‌ తాజా నిర్ణయంతో పాపులర్‌ ఏయూవీలైన హ్యారియర్‌(రూ.14.99 లక్షలు), సఫారీ(రూ.1549 లక్షల) ధరలు దిగొచ్చాయి. వీటితోపాటు నెక్సాన్, ఈవీపైనా రూ.1.3 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తున్నట్లు టాటా మోటార్స్‌ ప్రకటించింది. పంచ్‌ ఈవీపైనా రూ.30 వేల వరకు ప్రయోజనాలు అందిస్తామని తెలిపింది.

    స్తబ్ధత తొలగించేందుకు..
    భారత ఆటోమొబైల్‌ రంగంలో ప్రస్తుతం స్తబ్ధత నెలకొంది. జూన్‌ నెల రిటైల్‌ సేల్స్‌లో కేవలం రూ.073 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది. పాసింజర్, కమర్షియల్‌ వాహన విక్రయాల్లోనూ క్షీణత నమోదైంది. తఅవలో ఇన్వెంటరీ పేరుకుపోతోంది. 62–67 రోజుల ఆల్‌టైమ్‌ గరిష్టానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో కార్ల తయారీ కంపెనీలు డిస్కౌంట్లతో స్తబ్ధత తొలగించే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో డిమాండ్‌ పెరుగుతుందని భావిస్తున్నాయి. మరోవైపు యూపీ ప్రభుత్వం స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ కార్ల రిజిస్ట్రేషన్‌ ఫీజుపై మినహాయింపులు ప్రకటించింది.