Site icon OkTelugu

Modi daring decision: మోదీ డేరింగ్‌ డిసీజన్‌.. కటకటాల్లోకి సీఐఏ ఏజెంట్‌!

Modi daring decision

Modi daring decision

Modi daring decision: మోదీ ఏ నిర్ణయం తీసుకున్న మన దేశంలోని విపక్షాలు విమర్శిస్తుంటాయి. నిర్ణయం మంచిది అయినా చెడుది అయినా తప్పు పడుతుంటాయి. మంచి నిర్ణయాన్ని అభినందించడం విపక్షాలు ఎప్పుడో మర్చిపోయాయి. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో మోదీ నిర్ణయాలను తప్పు పట్టాయి. ఇక ఇటీవల అమెరికాతో మధ్యంతర డీల్‌ కుదరడంతో మోదీ అమెరికాకు తలొగ్గాడని ఆరోపించాయి. తాజాగా రష్యా ఆయిల్‌ విషయంలోనూ మోదీ ప్రభుత్వాన్ని తప్పు పట్టాయి. కానీ మోదీ మొదటి నుంచి వీటిని పట్టించుకోవడం లేదు. డేరింగ్‌ నిర్ణయాలతో దేశానికి ప్రయోజనాలు చేకూరుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత వ్యతిరేక కార్యకలాపాలు నడుపుతున్న ఖలిస్తానీ వేర్పాటు వాదులను కెనడాలో గుర్తించి చర్యలు తీసుకున్నారు. సిక్‌ ఫర్‌ జస్టిస్‌ పేరుతో దాడులు సృష్టించిన నాయకులను గుర్తు తెలియని వ్యక్తులు లేపేశారు. బ్రిటన్‌లో కూడా ఇలాంటి విఘనకారులను అరికట్టారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేకులు సడెన్‌గా హత్యకు గురవుతున్నారు. తాజాగా అమెరికాకు చెందిన సీఐఏ ఏజెంట్‌ను అరెస్టు చేయించారు. అంతేకాదు యూఏపీఏ యాక్ట్‌ పెట్టి జైల్లో పెట్టించారు.

అమెరికా ఎత్తుగడ..
భారత్‌ అనుకూల ఆపరేషన్లు నడుపుతున్న ఏజెంట్‌ను అమెరికా పోలీసులు పట్టుకున్నారు. దీంతో భారత్‌పై ఒత్తిడి చేయడానికి ప్రయత్నించింది. దీనికి భయపడకుండా మోదీ ప్రభుత్వం ముందుకు సాగింది. అదే సమయంలో భారత్‌లో అమెరికా కుట్రలు నడుపుతున్న మ్యాథ్యూ వాండైక్‌ అనే సీఐఏ ఏజెంట్‌ను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ఇతనితోపాటు మరో ఆరుగురు ఉక్రెయిన్‌ వ్యక్తులను అరెస్టు చేసింది. వీరిపై కఠినమైన యూఏపీఏ యాక్ట్‌ పెట్టి జైల్లోల పెట్టింది.

ఈశాన్య రాష్ట్రాల్లో కుట్రలు..
మ్యాథ్యూ వాండైక్‌ భారత్, బర్మా, బంగ్లాదేశ్‌ ప్రభుత్వాల వ్యతిరేక శక్తులకు శిక్షణ ఇస్తున్నాడని ఎన్‌ఐఏ నిర్ధారించింది. ఈశాన్య రాష్ట్రాల అడవుల్లో దుర్గమ ప్రాంతాల్లో కలిసి కుట్రలు పన్నుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులను రెచ్చగొడుతున్నట్లు నిర్ధారించింది. డ్రోన్‌ శిక్షణ ఇస్తున్నట్లు నివేదికలో పేర్కొంది.

క్రిష్టియన్‌ దేశం కోసమేనా..?
అమెరికా ఎప్పటి నుంచో బర్మా, బంగ్లాదేశ్, భారత ఈశాన్య రాష్ట్రాలను కలిపి క్రై స్తవ దేశం ఏర్పాటు చేయాలని ప్లాన్‌ వేస్తోంది. ఈ భాగంలో మణిపూర్‌లో అల్లర్లు సృష్టించారు. బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వాన్ని కూల్చారు. నేపాల్‌లో రెజీమ్‌ చేంజ్‌ పోరాటాన్ని వెనుక ఉండి నడిపింది. ఇప్పుడు బర్మా సైనిక పాలితాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.

ప్రధాని మోదీ భారత భద్రతకు అత్యంత ప్రధాన్యం ఇస్తారు. దేశానికి మించిన ప్రాధాన్యం దేనికీ ఇవ్వరు. ఈ క్రమంలో భారత్‌ ఈశాన్య భద్రతను బలోపేతం చేసుకుంటూ ఆయన తీసుకుంటున్న చర్యలు ప్రపంచవ్యాప్తంగా మన వ్యతిరేక శక్తులకు ఇబ్బందిగా మారుతున్నాయి. ఇది దేశ ఐక్యతకు కొత్త బలాన్నిస్తోంది.

Exit mobile version