Indian woman vs JD Vance: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆదేశంలో ఉంటున్న విదేశీయులకు కష్టాలు మొదలయ్యాయి. అక్రమంగా ఉంటున్నారని వేల మందిని ట్రంప్ వారి దేశాలకు పంపించారు. తర్వాతర అక్రమంగా ఉంటున్నవారిని పట్టుకుని జైళ్లలో పెట్టారు. ఇక యూనివర్సిటీలలో చదువుతున్న విద్యార్థులపై ఆంక్షలు విధించారు. సోషల్ మీడియా వినియోగంపై నిఘా పెట్టారు. హెచ్–1బీ వీసా నిబంధనలు కఠినతరం చేశారు. భారీగా ఫీజు పెంచారు. ఆటోమేటిక్ రెన్యూవల్ నిలిపివేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకరకాలుగా అమెరికాలో ఉంటున్న విదేశీయులను ట్రంప్ ముప్పు తిప్పలు పెడుతున్నారు. దీంతో అమెజాన్ హెచ్–1బీ వీసాల జోలికి పోమని ప్రకటించింది. ఇక కొత్తగా అమెరికా వెళ్లాలనుకునేవారు ఆ ఆలోచన విరమించుకుని ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయమై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ.వాన్స్‌ను ఓ ఎన్నారై యువతి కడిగి పారేసింది. ఆమె అడిగిన ప్రశ్నలకు ఆంధ్రా అల్లుడు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కఠిన వలస విధానాలకు సమర్థన..
మిసిసిప్పీ విశ్వవిద్యాలయంలో జరిగిన ‘‘టర్నింగ్ పాయింట్ యూఎస్‌ఏ’’ కార్యక్రమంలో కఠిన వలస విధానాల అవసరాన్ని వాన్స్ సమర్థించారు. చట్టబద్ధంగా వచ్చిన వలసదారుల ప్రవాహం కూడా అమెరికా సమాజాన్ని దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు. అయితే, సభలో భారతీయ మూలాలున్న యువతి ప్రశ్నలతో వాన్స్‌ను నిలదీశారు. అమెరికా కలలను నమ్మి చదువుకున్న, చట్టబద్ధంగా వచ్చినవారిని ఇప్పుడు ‘‘అనవసరమైనవారుగా’’ ఎందుకు చూస్తున్నారు? అని ఆమె గట్టిగా ప్రశ్నించారు. ఆమె మాటలకు హాజరైన విద్యార్థుల నుంచి చప్పట్లు వినిపించాయి. ఆ యువతి ఉద్వేగభరితంగా మాట్లాడుతూ వలసదారుల పాత్రను గుర్తించి, వారిని వెనక్కి నెట్టే విధానాలపై ప్రశ్నలు లేవనెత్తింది. వాన్స్ ఉద్దేశం వలసదారుల ప్రవాహాన్ని నియంత్రించడం మాత్రమేనని చెప్పినా, సమాధానం కొంత రక్షణాత్మకంగా అనిపించింది.
వాన్స్ వ్యాఖ్యలపై ఆగ్రహం..
తరువాత ఆమె, ‘‘అమెరికాను ప్రేమించాలంటే క్రిస్టియన్ కావాలా?’’ అని ఆలోచింపజేసే ప్రశ్న వేసింది. దానికి వాన్స్ తన మత విశ్వాసాన్ని గౌరవిస్తానని, భవిష్యత్తులో తన భార్య కూడా అదే దారిలో నడుస్తారని ఆశిస్తున్నానని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఘాటు చర్చకు దారితీశాయి. ఇండో–అమెరికన్ సమాజం వాన్స్ ద్వంద్వ వైఖరిని విమర్శిస్తోంది. భారతీయ సంప్రదాయ పద్ధతిలో ఆయన పెళ్లి జరిగిందంటూ, మత స్వేచ్ఛపై వ్యాఖ్యలు చేయడం ఆయన వ్యక్తిగత–సామాజిక విలువల మధ్య వ్యతిరేకతగా పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ ఘటన అమెరికా రాజకీయాల్లో వలస, మతం, వ్యక్తిగత జీవన విలువలు ఎంత ముడిపడి ఉన్నాయో చూపింది. వాన్స్ సమాధానాలు ఒక వలస దేశం ‘ఆత్మ’ మీదే ప్రశ్నలను లేవనెత్తాయి. ఆయన వ్యక్తిగత జీవితం నుంచి తాలూకు వ్యాఖ్యలు కూడా పాలసీ వైఖరిపై ప్రభావం చూపుతున్నాయి.
A brave young woman asks JD Vance: “When you talk about too many immigrants here, when did you guys decide that number? Why did you sell us a dream? You gave us the path and now tell us we don’t belong here? Why do you have to be Christian to be American?” pic.twitter.com/mQ3CTAnN58
— The Tennessee Holler (@TheTNHoller) October 30, 2025