Annamaiya District: ఆమెకి 40 సంవత్సరాలు. అతడికి 42 సంవత్సరాలు. ఇద్దరికీ వివాహాలు జరిగాయి. ఎవరికి వారుగా కుటుంబాలు ఏర్పరచుకున్నారు. సంసారాలు సాగిస్తున్నారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు.. అతడు తన భార్య ను వదిలేసి ఒంటరిగా ఉంటున్నాడు. కానీ, అతడు చేసిన పని సంచలనాన్ని కలిగించింది.
అన్నమయ్య జిల్లా తిప్ప సముద్రం మండలానికి చెందిన సల్మా (40), ఇదే పంచాయతీలోని నిలువు రాతి పల్లికి చెందిన బావాజాన్(42) కు మధ్య వివాహిత సంబంధం ఉంది. సల్మాకు గతంలోని ఓ వ్యక్తితో వివాహం జరిగింది. ఆమె భర్తతో కలిసి చేలూరు ప్రాంతంలోని గిరిగిరెడ్డిపాలెంలో ఉంటోంది. బావాజాన్ కర్ణాటక రాష్ట్రంలోని చింతామణి ప్రాంతానికి చెందిన తస్లీమ్ ను వివాహం చేసుకున్నాడు. ఇతడు కూడా చేలూరు ప్రాంతంలోని రంగుండ్లు లో సంసారం సాగిస్తున్నాడు.
భార్యను వదిలేసి బావా జాన్ మూడు సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటున్నాడు. ఇదే క్రమంలో అతడు సల్మాతో పరిచయం పెంచుకున్నాడు. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇక ఇటీవల సల్మా మరొక వ్యక్తితో చనువుగా ఉంటుందని భావించిన బావా జాన్ ఆమె మీద కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా సరే ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆమె ఇంటికి వెళ్ళాడు బావా జాన్. ఆమెకు మాయమాటలు చెప్పాడు. ఆ తర్వాత మంచం మీదనే తన వెంట తెచ్చుకున్న కత్తితో అత్యంత కిరాతకంగా గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత బావా జాన్ ఇంటికి వెళ్ళి ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. ఈ వార్త చేలూరు లో సంచలనాన్ని కలిగించింది. పోలీసులు బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి విచారణ సాగిస్తున్నారు.