Ravi Teja Mass Jatara: ఫ్లాప్ హీరో, ఫ్లాప్ నిర్మాత, ఫ్లాప్ హీరోయిన్ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనే దానికి ఉదాహరణ ‘మాస్ జాతర'(Mass Jathara Movie). నేడు ప్రీమియర్ షోస్ తో ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో హీరో గా నటించిన రవితేజ(Mass Maharaja Ravi Teja) కు వరుసగా 6 డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. ఇక హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘ధమాకా’, ‘భగవంత్ కేసరి’ చిత్రాలు తప్ప ఈమె చేసిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. ఇక కరోనా లాక్ డౌన్ తర్వాత అత్యధిక సక్సెస్ రేట్ ని ఎంజాయ్ చేసిన నాగవంశీ గత చిత్రాలు ‘వార్ 2′,’కింగ్డమ్’ భారీ నష్టాలను తీసుకొచ్చాయి. ఇన్ని నెగిటివ్స్ మధ్య ఈ సినిమా తెరకెక్కింది. పైగా ఈ చిత్రానికి దర్శకుడుని చూసి వెళ్లాలని అనుకుంటే, అతనేమో ఇండస్ట్రీ కి కొత్త.
అందుకే ఈ సినిమాకు ఖర్చు అయినా బడ్జెట్ కి, జరిగిన బిజినెస్ కి అసలు సంబంధమే లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. బడ్జెట్ దాదాపుగా 35 కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు అయ్యిందట. కానీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 20 కోట్ల రూపాయలకు జరిగింది. అంటే 15 కోట్ల నష్టం తోనే ఈ సినిమాని నాగవంశీ విడుదల చేస్తున్నాడు అన్నమాట. ఇంతకు ముందు థియేట్రికల్ బిజినెస్ తో సంబంధం లేకుండా, ఓటీటీ సంస్థలు అడిగినంత డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, సినిమా థియేటర్స్ లో విడుదలై సూపర్ హిట్ అయితే ఒక రేట్, ఫ్లాప్ అయితే ఒక రేట్ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. అందుకే ‘మాస్ జాతర’ ఓటీటీ డీలింగ్స్ కూడా పూర్తి అవ్వలేదని టాక్. నెట్ ఫ్లిక్స్ సంస్థ తో చర్చలు జరిపారట, కానీ విడుదలై ఫలితాన్ని చూసిన తర్వాతే ఒక అంచనా కి రాగలం అని చెప్పారట.
దీంతో నాగవంశీ చేసేది ఏమి లేక 15 కోట్ల నష్టం తోనే ఈ సినిమాని విడుదల చేస్తున్నాడు. కానీ కచ్చితంగా ఈ చిత్రం సక్సెస్ సాధిస్తుంది అనే నమ్మకం ఆయనలో ఉందట. థియేట్రికల్ ట్రైలర్ కి కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే రవితేజ కి తన కెరీర్ లో ఇంత తక్కువ బిజినెస్ జరగడం ఈ సినిమాకే మొదటిసారి అట. ఆయన గత చిత్రాల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ లు కనీసం 30 కోట్ల రేంజ్ లో ఉండేవి. కానీ ఇప్పుడు అది 20 కోట్లకు పడిపోయింది. అది కూడా రిటర్న్ జీఎస్టీ కలిపి. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే ఇక రవితేజ సినిమాలు మానేసుకోవడమే అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.