Chinmayi: సినిమా ఇండస్ట్రీలో మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగితే అందరికి మంచిది. అలా కాదని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకొని వాళ్ళు చేసే కామెంట్స్ కి రియాక్ట్ అవ్వడం వల్ల ప్రేక్షకుల దృష్టిలో బ్యాడ్ నేమ్ ని మూట కట్టుకొనే అవకాశం ఉంది. ఇండస్ట్రీ లో ఎలాంటి కాంట్రవర్సీ లేనివారికే అవకాశాలు వస్తాయి. ఇక సింగర్ చిన్మయి విషయానికి వస్తే సినిమా ఇండస్ట్రీ గురించి గాని, లేడీస్ కి సంబంధించిన విషయాల్లో గాని ఆమె చాప తొందరగా రియాక్ట్ అవుతుంది. ఇక రీసెంట్ గా శివాజీ హీరోయిన్స్ డ్రస్సుల గురించి మాట్లాడినప్పుడు ఆమె పలు రకాల కామెంట్లు చేసింది. ఆమె మీద పలు విమర్శలు రావడంతో కామ్ అయిపోయింది. ప్రస్తుతం చిరంజీవి సైతం రీసెంట్ గా ఒక ఈవెంట్లో ఇండస్ట్రీ అందరిని ఆదరిస్తుంది. ఓన్ టాలెంట్ ని ప్రదర్శిస్తూ ముందుకు సాగాలి, కాస్టింగ్ కౌచ్ లు ఉండవు. మనం మన లక్ష్యం మీద ఫోకస్ పెట్టి ముందుకు సాగితే మనల్ని ఎవరూ ఆపలేరు అంటూ ఆయన కామెంట్స్ చేశారు.
దానికి చిన్మయి కౌంటర్ ఇస్తూ ఇండస్ట్రీలో చాలామంది కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొంటున్నారు. ప్రతి ఒక్క అమ్మాయికి అవకాశం రావాలంటే కాస్టింగ్ కౌచ్ పేరుతో చాలా రకాలుగా వాళ్లను వేధిస్తున్నారు అంటూ ఆమె కౌంటర్ అయితే ఇచ్చింది. దీని మీద నెటిజన్లు సైతం విమర్శలు చేస్తున్నారు.
చిరంజీవి మాట్లాడింది ఏమిటి నువ్వు చెప్పిన సమాధానం ఏంటి నీ సంకల్పం గట్టిదైతే నువ్వు టాప్ లెవెల్ కి వెళ్ళిపోతావు. అంటూ చిరంజీవి చెబితే నువ్వు మాత్రం ఎంత టాలెంట్ ఉన్నా కాస్టింగ్ కౌచ్ లు ఎదుర్కోక తప్పదు అంటూ మాట్లాడడం సరైనది కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయిన అవసరం ఉన్నా లేకున్నా ప్రతి విషయంలో నువ్వు తల ఎందుకు తలదురుస్తున్నావ్ అంటు చిన్మాయి ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు…ఇక ఇప్పటికైనా చిన్మయి తన వైఖరిని మార్చుకొని ముందుకు సాగితే మంచిది. లేకపోతే ఆమెకు ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చే ఛాన్సులైతే లేవు…