America: అమెరికా గొప్పగా ఉంటుంది. జీవించే విధానం బాగుంటుంది. డబ్బులు సంపాదించుకోవచ్చు.. విలాసవంతంగా బతకొచ్చు. అపరిమితమైన స్వేచ్ఛను అనుభవించవచ్చు.. అని చాలామంది అనుకుంటారు. కానీ మంచి వెనుక చెడు ఉన్నట్టు అమెరికాలో కూడా దారుణాలు చాలా ఉన్నాయి. అక్కడ తుపాకుల సంస్కృతి ఎక్కువగా ఉంటుంది. సాటి మనిషి మీద కాల్పులు జరపడం.. అత్యంత క్రూరంగా అంతం చేయడం.. డబ్బులు ఇవ్వకుంటే దాడులు చేయడం.. మాదకద్రవ్యాలు.. నేరాలు.. ఆయుధాలు కలిగి ఉండడం.. ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికాలో ఉన్న అవ లక్షణాలు ఒక పట్టాన కొరుకుడు పడవు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తి పెరిగిపోవడంతో అమెరికాలో ఉన్న దారుణాలు వెంట వెంటనే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అక్కడ జరిగిన ఒక దారుణం సభ్య సమాజాన్ని తల దించుకునేలా చేస్తోంది.
Also Read: అప్పట్లో ‘కాంతారా’ ని ఎవ్వరూ కొనలేదు..ఇప్పుడు ‘కాంతారా 2’ ఎంతకి అమ్ముడుపోయిందంటే!
అమెరికాలో భారత సంతతికి చెందిన నాగ మల్లయ్య అనే వ్యక్తి ఇటీవల దారుణ హత్యకు గురయ్యాడు. అతని హత్యకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాగమల్లి తో పాటు మార్టినెజ్ అనే వ్యక్తి కూడా పనిచేస్తుంటాడు. ఆ వ్యక్తి నాగమలయను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అతడి శిరస్సును ఖండించాడు. వాషింగ్ మిషన్ పనిచేయడం లేదని నాగ మల్లయ్య నేరుగా చెప్పకుండా మరో ఉద్యోగినితో మార్టినెజ్ తో చెప్పించాడు. దీనికి మార్టినెజ్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు పట్టరాని కోపంతో ఊగిపోతూ వెంటనే నాగ మల్లయ్యను అంతం చేశాడు. ఆ తర్వాత రక్తపు మడుగులో కొట్టుకుంటూ నాగ మల్లయ్య ప్రాణాలు విడిచాడు. అమెరికాలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు మార్టినెజ్ ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా విస్మయకర వాస్తవాలను వెల్లడించారు.
నిందితుడు మానసిక వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. గతంలో అనేక నేరాలకు పాల్పడ్డాడు. కొద్దిరోజుల పాటు జైలు శిక్ష అనుభవించి ఈ ఏడాది జనవరిలో విడుదలయ్యాడు. అప్పటినుంచి ఒక దగ్గర పనిచేస్తున్నాడు. ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు. తనలో తాను నవ్వుకునేవాడు. అంతేకాకుండా ఎదుటి వ్యక్తుల మీద తీవ్రమైన మనస్తత్వాన్ని ప్రదర్శించేవాడు. పరుష పదజాలంతో తిట్టేవాడు. భారతీయులంటే మండిపడేవాడు. అంతేకాదు ఆ కారణంగా అమెరికా సొమ్మును భారతీయులు తింటున్నారని ఆరోపించేవాడు. జైలులో కూడా ఇతర ఖైదీలపై దారుణాలకు పాల్పడేవాడు. జనవరిలో జైలు నుంచి విడుదలైన తర్వాత బయట అనేక మందితో గొడవపడ్డాడు. చివరికి నాగమల్లయ్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. పోలీసుల విచారణలో ఈ ఘోరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. మన దేశం మీడియాలో దీనికి సంబంధించిన వార్త విశేషంగా ప్రసారం అవుతుండడంతో.. అమెరికాలో మానసిక వ్యాధితో బాధపడేవారు చాలామంది ఉన్నారని.. అటువంటి వారికి దూరంగా ఉండాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.