Kantara 2: చిన్న సినిమాలుగా మొదలై బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ ని క్రియేట్ చేసిన సినిమాలు ఈమధ్య కాలం లో చాలానే ఉన్నాయి. వాటిల్లో ‘కాంతారా'(Kanthara Movie) చిత్రం ఒకటి. కన్నడ దర్శకుడు రిషబ్ శెట్టి హీరో గా నటిస్తూ చేసిన ఈ చిత్రం ఎలాంటి హంగామా లేకుండా విడుదలై సెన్సేషన్ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా కూడా ప్రారంభం లో అనేక ఒడిదుగులను ఎదురుకుంది. అప్పట్లో ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని కొనుగోలు చేసేందుకు ఒక్క ఓటీటీ సంస్థ కూడా ముందుకు రాలేదట. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీ హక్కులను అమ్మకుండానే థియేటర్స్ లోకి విడుదల చేశారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ చిత్రం థియేటర్స్ లో అద్భుతాలను నెలకొల్పింది. ఏ ఓటీటీ సంస్థలు విడుదలకు ముందు ఈ సినిమాని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదో, అవే ఓటీటీ సంస్థలు విడుదల తర్వాత ఫ్యాన్సీ రేట్స్ తో నిర్మాతల ఇంటి చుట్టూ ప్రదిక్షణలు చేశాయి. ఇది కదా అసలు సిసలు సక్సెస్ అంటే.
మొత్తానికి అప్పటి మార్కెట్ లెక్కల ప్రకారం ‘కాంతారా’ చిత్రం ఓటీటీ రైట్స్ ని విడుదల తర్వాత అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది. కానీ ఇప్పుడు ‘కాంతారా : ఛాపర్ 1′(Kanthara : Chapter 1) ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ అక్షరాలా 125 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని టాక్. అంటే KGF చాప్టర్ 2 కంటే ఎక్కువ అన్నమాట. కేవలం ఓటీటీ రైట్స్ విషయం లోనే కాదు, థియేట్రికల్ రైట్స్ విషయం లో కూడా ఈ సినిమా ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పుతుంది. కేవలం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ నే వంద కోట్ల రూపాయలకు పైగా అమ్ముడుపోయింది టాక్. కొంతమంది తెలుగు స్టార్ హీరోలకు కూడా ఈ రేంజ్ బిజినెస్ జరగలేదు. అక్టోబర్ 2 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకెన్ని అద్భుతాలు నెలకొల్పుతుందో చూడాలి.