Bigg Boss 9 Telugu Mask Man: అగ్నిపరీక్ష షో లో తనదైన ముద్ర వేసుకొని, బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) లోకి అడుగుపెట్టిన మాస్క్ మ్యాన్ గురించి ఆడియన్స్ లో బోలెడన్ని అంచనాలు ఉండేవి. కానీ ఆ అంచనాలను రోజురోజుకి అందుకోవడం లో విఫలం అవుతూనే వస్తున్నాడు మాస్క్ మ్యాన్. తాను ఏదైతే చెప్తున్నాడో, దానిని అనుసరించడం లో ముందుగా ఈయనే విఫలం అవుతున్నాడు. సార్ రూల్స్ పెడుతాడు, నీతూ చెప్తాడు, కానీ ఆయన మాత్రం అనుసరించడు అని ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, అది మాస్క్ మ్యాన్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ప్రతీ చిన్న విషయం లోనూ తనని తాను దివి నుండి దిగి వచ్చిన కారణజన్ముడు లాగా ప్రొజెక్ట్ చేసుకొని మాట్లాడుతూ ఉంటాడు, కానీ గేమ్ లో ఓడిపోతే ఎదుటి వాళ్ళను శత్రువులాగా చూసేంత తక్కువ స్థాయికి దిగజారిపోతాడు.
Also Read: అప్పట్లో ‘కాంతారా’ ని ఎవ్వరూ కొనలేదు..ఇప్పుడు ‘కాంతారా 2’ ఎంతకి అమ్ముడుపోయిందంటే!
ఎలాంటి పరిస్థితి వచ్చిన నోరు జారను , నా క్యారక్టర్ అలాంటిది అని చెప్పుకునే మాస్క్ మ్యాన్, వెనుక చేరి భరణి, ఇమ్మానుయేల్ ఆడవాళ్ళూ అంటూ నీచమైన కామెంట్స్ చేస్తారు. వాళ్లిద్దరూ హరీష్ తమ పక్కన ఉన్నా, లేకపోయినా అతని ప్రస్తావన వచ్చినప్పుడు ‘గారు’ అనే సంబోధిస్తూ ఉంటారు. కానీ ఇతను మాత్రం మంచి మర్యాద మర్చిపోయి మాట్లాడుతూ ఉంటాడు. ఇక సంజన దగ్గరకు వెళ్లి మీరు చెప్పింది చెప్పినట్టు చేయడానికి మీ బానిసలం కాదు, గుడ్డు దొంగతనం చేసి ఇంటి మొత్తాన్ని పరేషాన్ చేసిన నువ్వెంటి మాకు చెప్పేది. నువ్వు కరెక్ట్ గా ఉంటూ ఎదురు వాళ్ళ గురించి మాట్లాడు, నువ్వు కరెక్ట్ లేకుండా అవతల వాళ్ళ గురించి మాట్లాడే హక్కే నీకు లేదు అంటూ సినిమా డైలాగ్స్ వీరోచితంగా కొట్టి చివరికి ఇతనికి చేసింది ఏంటో తెలుసా?, కూల్ డ్రింక్ దొంగతనం. సంజన దొంగతనం చేసినప్పుడు ఆమె గురించి అన్ని తప్పు మతాలూ మాట్లాడి, ఇప్పుడు నువ్వు ఎలా దొంగతనం చేస్తావు?, దొంగతనం చేసిన నీకు ఇప్పుడు సంజన గురించి మాట్లాడే హక్కు ఉందా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ నిలదీస్తున్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కెప్టెన్సీ టాస్క్ లో తన తరుపున ఆడిన పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే, భరణి దానిని పసిగట్టి అరుస్తాడు. ఆయనే కాదు, హౌస్ మేట్స్ అందరూ అరుస్తారు. ఇది మనసులో పెట్టేసుకున్నాడు హరీష్, భరణి వల్లే తనకు కెప్టెన్ అయ్యే ఛాన్స్ మిస్ అయ్యింది అనే అక్కసుతో అతనితో మాట్లాడడమే మానేసాడు. ఉదయం నిద్ర లేచిన తర్వాత గుడ్ మార్నింగ్ చెప్తే మాస్క్ మ్యాన్ నుండి సమాధానం లేదు. అంతే కాదు భరణి చేత చేసిన వంటని నేను అసలు తినను, నాకు నేనుగా చేసుకొని తింటాను,లేదంటే పస్తులు ఉంటాను అంటూ, భరణి ఎదో చెయ్యరని ద్రోహం తనకు చేసినట్టు జనాలకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటి వరకు అయితే మాస్క్ మ్యాన్ హరీష్ బిగ్ బాస్ జర్నీ తప్పు దోవలోనే వెళ్తుంది, ఇలాగే కొనసాగితే ఎదో ఒక వారం లో ఎలిమినేట్ అవ్వడం పక్కా అని అంటున్నారు నెటిజెన్స్.