Kareena Kapoor Khan: ఈ క్రమంలోనే చాలామంది విలన్లు కూడా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ ఒక స్టార్ విలన్ భార్య గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు సినిమాలలో నటిస్తూనే పలు వ్యాపారాలలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టి ఓ రేంజ్ లో సంపాదిస్తున్నారు. సినిమాలలో కోట్లలో పారితోషకం అందుకుంటూనే మరోవైపు వ్యాపారంలో కూడా భారీగా లాభాలు పొందుతున్నారు. రీసెంట్ గా వందల కోట్లు సంపాదించి ఒక హీరోయిన్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మన సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు హీరోలకు సమానంగా పారితోషకం అందుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఒక టాలీవుడ్ విలన్ భార్య ఆస్తుల వివరాలు సామాజిక మాధ్యమాలలో అందరికీ షాక్ కు గురిచేస్తున్నాయి. హీరోయిన్ గా కూడా భారీగా సంపాదించిన ఈ బ్యూటీ ఆస్తులు ప్రస్తుతం కొన్ని వందల కోట్లు. ప్రస్తుతం ఫోటోలో కనిపిస్తున్న ఆమె భర్త టాలీవుడ్ లో విలన్ గా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇటీవలే విలన్ గా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకున్నాడు. రీసెంట్ గా ఈయన నటించిన సినిమా బాక్సాఫీస్ దగ్గర 600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హీట్ అయ్యింది. ఈ నటి మరెవరో కాదు ఒకప్పటి బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ ఖాన్. బాలీవుడ్లో ఈమె టాప్ హీరోయిన్లలో ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కరీనాకపూర్ బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ కు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా బాగా గుర్తింపు ఉంది. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమాతో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా తెలుగులో విలన్ పాత్రలో కనిపించాడు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ఇక ఈ మధ్యకాలంలో సైఫ్ అలీఖాన్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో కూడా విలన్ పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. దేవర సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ దేవర 2 సినిమాలో నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కరీనా కపూర్ ఆస్తుల విలువ రూ.485 కోట్లు గా సమాచారం. అలాగే ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్ ఆస్తుల విలువ రూ.1685 కోట్లు గా తెలుస్తుంది.
View this post on Instagram