Homeఅంతర్జాతీయంMarco Rubio India Visit: అడుగడుగునా అవమానం.. అమెరికాకు ఇచ్చి పడేసిన భారత్..

Marco Rubio India Visit: అడుగడుగునా అవమానం.. అమెరికాకు ఇచ్చి పడేసిన భారత్..

Marco Rubio India Visit: సరిగ్గా కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే.. అమెరికా అధ్యక్షుడు లేదా విదేశాంగ శాఖ మంత్రి.. రక్షణ శాఖ మంత్రి గనుక ఇండియాకు వస్తే.. ఏర్పాట్లు ఒక రేంజ్ లో ఉండేవి. ఎర్ర తివాచి పరిచి స్వాగతం పలికేవారు. దేశ ప్రధాని నుంచి మొదలు పెడితే మంత్రుల వరకు ఎదురేగి వెల్కమ్ చెప్పేవారు.. మీడియా అయితే రకరకాల స్టోరీలను పబ్లిష్ చేసేది. అమెరికా నుంచి వచ్చే వారికోసం రకరకాల వంటలు ఇక్కడ సిద్ధమయ్యేవి. వారి మెప్పు పొందడం కోసం పాలకులు తెగ తాపత్రయపడేవారు.

ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా అమెరికా అంటే భారత్ సులభంగా తీసుకునే పరిస్థితి వచ్చేసింది. ఇటీవల అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఇండియాకు వచ్చారు. ఆయనకు చెప్పుకునే స్థాయిలో స్వాగతం లభించలేదు. సూటు, బూటు, కోటు ధరించి వచ్చిన పాపానికి ఉక్క పోతతో ఇబ్బంది పడ్డాడు. దేశ ప్రధాని రూబియోకు ఘన స్వాగతం పలకలేదు.. ఇతర మంత్రులు కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పలేదు. కొంతమంది అధికారులు మాత్రమే అది కూడా తూతూ మంత్రంగా మార్క్ రుబియో కు స్వాగతం పలికారు. ఇండియా పర్యటనలో రూబియో ముందుగా కోల్కతా వెళ్లారు. అక్కడ మదర్ థెరిసా స్థాపించిన చారిటీ కార్యాలయాలకు వెళ్లారు. అక్కడ ఏదో మాటలు మాట్లాడారు. ఆ తర్వాత ఢిల్లీ వచ్చారు. తను చెప్పాల్సిన అంశాలను చెప్పారు. వాటికి ఇండియా కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. దీంతో రూబియో ఒక రకమైన నిరాశతో తన స్వదేశానికి వెళ్ళిపోయారు.

వచ్చే నవంబర్లో అమెరికాలో జరిగే ఎన్నికల్లో రూబియో పోటీపడుతున్నారు. ఇండియా పర్యటనను తన విజయానికి అనుకూలంగా మార్చుకోవడానికి ఆయన అనేక రకాల ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా క్రైస్తవుల విశ్వాసాన్ని పొందడానికి ఆయన చారిటీ సంస్థలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలకు సంబంధించిన వ్యవహారాలను అమెరికా మీడియాలో ఆయన గొప్పగా రాయించుకున్నారు. కానీ, ఢిల్లీలో జరిగిన సమావేశంలో మాత్రం రూబియో సైలెంట్ అయిపోయారు.

రూబియో కు ఇలా అవమానం జరగడానికి ప్రధాన కారణం ట్రంప్. గతంలో భారత్ అమెరికా మధ్య సంబంధాలు బలంగా ఉండేవి. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత భారత్ మీద విషం కక్కుతున్నాడు. టారిఫ్ లు.. చమురు విషయంలో తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాడు. భారతదేశాన్ని డెడ్ ఎకానమీ అంటూ విమర్శిస్తున్నాడు. అంతేకాదు.. భారత దేశం గురించి లేకి మాటలు మాట్లాడాడు. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకున్న మన దేశం.. అమెరికాకు గట్టి అవమానం చేసింది. ఇకపై అమెరికా భారత్ ప్రస్తావన తీసుకొస్తేనే వణికే పరిస్థితి కల్పించింది. తమతో పెట్టుకుంటే ఇలానే ఉంటుందని గట్టి హెచ్చరికలు చేసింది..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular