Homeఅంతర్జాతీయంLondon Balaji Temple: లండన్‌లో కొలువుదీరిన బాలాజీ.. ఘనంగా ఆలయం ప్రారంభోత్సవం

London Balaji Temple: లండన్‌లో కొలువుదీరిన బాలాజీ.. ఘనంగా ఆలయం ప్రారంభోత్సవం

London Balaji Temple: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశశ్వరస్వామి. తిరుమలలో కొలువైన ఆ కోనేటి రాయుడి దర్శనం కోసం నిత్యం వేలాది మంది వస్తుంటారు. గంటల తరబడి క్యూలైన్లలో బారులు తీరి దర్శించుకుంటారు. ఇక తిరుమల రాలేని భక్తుల కోసం టీటీడీ అనేక ప్రాంతాల్లో వేకంటేశ్వరస్వామి ఆలయాలు నిర్మిస్తోంది. తాజాగా లండన్‌లోనూ ఆ ఏడుకొండలవాడి ఆలయం ఇటీవల నిర్మించారు. ఆలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా, శాస్త్రోక్తంగా నిర్వహించారు.

స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో..
లండన్‌లో శ్రీవేకంటేశ్వర(బాలాజీ) టెంపుల్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌(ఎస్‌వీబీటీసీసీ) 2019లో ఏర్పడిన స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే లండన్‌లోని బ్రాక్నెల్‌లో వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో పురాతన హిందూ గ్రంథాలు, శిల్ప స్థాపత్య శాస్త్రాలను అనుసరించి శుభకార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ, ఇతర అర్చకుల సారథ్యంలో శ్రీవేకంటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారి ప్రాణ ప్రతిష్ట నిర్వహించారు.

అతిపెద్ద ఆలయం ఇదే..
ఇక లండన్‌లో నిర్మించిన అతిపెద్ద వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించాలన్న విస్తృత ఆశయానికి ఇది మైలురాయిగా నిలిచిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. వేడుకల్లో ఎస్‌వీబీటీసీసీ ట్రస్టీలు డాక్టర్‌ రాములు దాసోజు, కృష్ణకిశోర్, సురేశ్‌రెడ్డి, కమలా కోటచర్ల, ప్రవీణ్‌ మస్తీ, సురేశ్‌ గోపతి, భాస్కర్‌ నీల, పావనిరెడ్డి, సహా ఎగ్జిక్యూటివ్‌ టీమ్‌ సభ్యులు తుకారాంరెడ్డి, రవి వాసా, రవి శ్రీరంగం, వంశీ.వి, వంశీ.బి, విశ్వేశ్వర్‌ గోవర్ధన్, రాఘవేంద్ర, గౌతంశాస్త్రి, గోపి కొల్లూరు, వాలంటీర్లు హాజరయ్యారు. ఈ ఆలయం వారంలో అన్ని రోజులు ఉదయం, సాయంత్రం తెరిచి ఉంటుందని తెలిపారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version