RCB Vs LSG: లక్నో గెలుపునకు బెంగుళూరు ఓటమి కి మధ్య ఆ ఒక్కడు

182 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆల్ అవుట్ అయింది లోమ్రోర్(33), రజత్ పాటిదార్(29) మినహా మిగతా వారెవరూ చెప్పుకోదగిన స్కోర్ సాధించలేదు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 3, 2024 8:25 am

RCB Vs LSG

Follow us on

RCB Vs LSG: ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు మరో పరాజయాన్ని మూట కట్టుకుంది. సొంత మైదానంలో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్ లో ఆర్ సీ బీ 28 పరుగుల తేడాతో లక్నో చేతిలో ఓడిపోయింది. చెత్త బౌలింగ్, పసలేని బ్యాటింగ్ బెంగళూరు కొంప ముంచాయి. విరాట్ కోహ్లీ, గ్రీన్, మాక్స్ వెల్, డూ ప్లెసిస్ లాంటి వారు ఉన్నప్పటికీ బెంగళూరు ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు ఐదు వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసింది. డికాక్(81) తుఫాన్ ఇన్నింగ్స్ తో తో చెలరేగాడు. చివర్లో పురన్(40) మెరుపులు మెరిపించాడు. బెంగళూరు బౌలర్లలో మాక్స్ వెల్ రెండు వికెట్లు పడగొట్టాడు. టోప్లీ, యశ్ దయాళ్, సిరాజ్ తలా ఒక వికెట్ తీశారు. బెంగళూరు బౌలింగ్ సరిగా లేకపోవడం, ఫీల్డింగ్ నాసిరకంగా ఉండడంతో లక్నో ఆటగాళ్లు పండగ చేసుకున్నారు.

182 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆల్ అవుట్ అయింది లోమ్రోర్(33), రజత్ పాటిదార్(29) మినహా మిగతా వారెవరూ చెప్పుకోదగిన స్కోర్ సాధించలేదు. మయాంక్ యాదవ్ (3/14) నిప్పులు చెరిగే బంతులు వేయడంతో బెంగళూరు బ్యాటర్లు వణికి పోయారు. సిద్ధార్థ, నవీన్ ఉల్ హక్, యశ్ ఠాకూర్, మార్కస్ స్టోయినీస్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.

ఈ మ్యాచ్ ద్వారా బౌలర్ మయాంక్ యాదవ్ సరికొత్త ఘనత సృష్టించాడు. ఐపీఎల్ హిస్టరీలో మూడుసార్లు కంటే ఎక్కువ 155 కి.మీ/గం వేగంతో బౌలింగ్ చేసిన తొలి పేస్ బౌలర్ గా వినతికెక్కాడు. రెండు మ్యాచ్ లోనే 50 బంతులు మాత్రమే సంధించి ఈ ఘనతను అందుకున్నాడు. ఇతని కంటే ముందు ఉమ్రాన్ మాలిక్, అన్రిచ్ నోకియా మాత్రమే రెండుసార్లు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బంతులు విసిరారు. బెంగళూరు జట్టుతో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో మాయాంక్ యాదవ్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్లో మయాంక్ యాదవ్ 157 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో షాన్ టెయిట్ 157.7 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతి ఇప్పటివరకు అత్యధిక వేగవంతమైన బౌలింగ్ రికార్డుగా వినతికెక్కింది.