Trump Attack : ట్రంప్ పై హత్యాయత్నం కేసులో కొత్తకోణం.. కీలక విషయాలు వెల్లడించిన అమెరికన్ ఇంటెలిజెన్స్

ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన తర్వాత అమెరికాలో కలకలం నెలకొంది. ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు అమెరికన్ సీక్రెట్ పోలీసింగ్ వ్యవస్థ రంగంలోకి దిగింది. ఘటనకు సంబంధించి విచారణ నిర్వహిస్తుండగానే.. అమెరికన్ ఇంటెలిజెన్స్ పోలీసులు సరికొత్త నివేదికను ఆ దేశ భద్రతా అధికారులకు అందించారు.. అయితే ఈ రిపోర్టు శనివారం ట్రంప్ పై కాల్పుల ఘటనకు కొన్ని వారాల క్రితమే ఇచ్చినట్టు తెలుస్తోంది.

Written By: Bhaskar, Updated On : July 17, 2024 5:22 pm
Follow us on

Trump Attack  : మరి కొద్ది నెలల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అటు రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. డెమొక్రాటిక్ పార్టీ నుంచి జో బైడన్ పోటీలో ఉన్నారు. ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా పని చేయగా.. బైడన్ ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ జోరు చూపిస్తున్నారు. ఇటీవల పెన్సిల్వేనియా ప్రాంతంలోని బట్లర్ ప్రాంతంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించగా.. ఓ దుండగుడు ట్రంప్ ను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ట్రంప్ కుడి చెవికి గాయమైంది. రక్త స్రావం కూడా తీవ్రంగా జరిగింది. అనంతరం ఆయనను అమెరికా పోలీసులు ఆసుపత్రికి తరలించారు. దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హరీస్ ఖండించారు.

సంచలన రిపోర్టు

ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన తర్వాత అమెరికాలో కలకలం నెలకొంది. ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు అమెరికన్ సీక్రెట్ పోలీసింగ్ వ్యవస్థ రంగంలోకి దిగింది. ఘటనకు సంబంధించి విచారణ నిర్వహిస్తుండగానే.. అమెరికన్ ఇంటెలిజెన్స్ పోలీసులు సరికొత్త నివేదికను ఆ దేశ భద్రతా అధికారులకు అందించారు.. అయితే ఈ రిపోర్టు శనివారం ట్రంప్ పై కాల్పుల ఘటనకు కొన్ని వారాల క్రితమే ఇచ్చినట్టు తెలుస్తోంది. అందువల్లే ట్రంప్ కోసం సీక్రెట్ సర్వీస్ భద్రతను పెంచినట్టు తెలుస్తోంది.

ఇరాన్ కాదు

ట్రంప్ పై హత్యాయత్నం ఘటనలో ఇరాన్ కుట్ర పన్నిందని.. కాల్పులు జరిపిన 20 సంవత్సరాల యువకుడికి ఇరాన్ తో సంబంధం లేదని అమెరికా అధికారులు ప్రకటించారు.. ట్రంప్ కానాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆయనకు భద్రతను పెంచినట్టు పోలీసులు ప్రకటించారు. ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఇరాన్ సుప్రీం కమాండర్ ఖాసీం సులేమానీ హతమయ్యాడు. అప్పటినుంచి ట్రంప్ నకు ఇలాంటి దేశం నుంచి తరచుగా బెదిరింపులు వస్తున్నాయి. అయితే దీనిపై తమకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందని అమెరికా సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి అప్పట్లో ప్రకటించడం సంచలనంగా మారింది. అందుకు అనుగుణంగానే ట్రంప్ భద్రతను అమెరికా పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారు. ఇరాన్ నుంచి మాత్రమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ట్రంప్ కు బెదిరింపులు రావడంతో.. పోలీసులు ప్రతి బెదిరింపును చాలా తీవ్రంగా పరిగణించారు. అత్యంత వేగంగా ప్రతిస్పందించారు. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ ట్రంప్ పై హత్యాయత్నం జరగడం విశేషం. మరోవైపు ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో ఇరాన్ మిషన్ తీవ్రంగా స్పందించింది. “ట్రంప్ ఒక నేరస్థుడు. అతడివన్నీ దురుద్దేశ పూరితమైన ఆరోపణలు. అతడిని కోర్టులోనే శిక్షించాల్సిన అవసరం ఉందని” వ్యాఖ్యానించింది.

అరెస్టు చేశారు

ట్రంప్ పై హత్యాయత్నం విఫలమైన తర్వాత ఓ కన్వెన్షన్ జరిగింది. ఆ కార్యక్రమానికి ఓ సాయుధ వ్యక్తి హాజరయ్యాడు. తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు మాస్క్ ధరించాడు. ఆ వ్యక్తి తన వీపుపై బ్యాగ్ తగిలించుకున్నాడు. అందులో ఏకే 47 తుపాకిని మోసుకెళ్లాడు. ఆ బ్యాగులో తూటాల మ్యాగజైన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాలను అమెరికా కేంద్రంగా వార్తలు ప్రసారం చేసే ప్రఖ్యాత న్యూస్ ఛానల్ ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. దీంతో ట్రంప్ భద్రతను పర్యవేక్షించే పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.