Russia Crisis : పాముకు పాలు పోసినంత మాత్రాన అది ప్రేమ చూపించదు. తన సహజ లక్షణం ప్రకారం కాటు వేస్తుంది. విషాన్ని చిమ్ముతుంది. ప్రాణాలు తీస్తుంది. ఇక్కడ పాము ది అసలు నేరం కాదు. పాము స్వభావం తెలిసినప్పటికీ కూడా దానిని చేరదీయడం అసలు తప్పు. ఇప్పుడు దీనికి రష్యా ఎదుర్కొంటున్న పరిస్థితికి, ఒకప్పుడు అమెరికా నేర్చుకున్న గుణ పాఠానికి ఖచ్చితమైన సంబంధం ఉంది. కానీ ఈ రెండు దేశాల మధ్య ఒకసారి ఉంది. అది ఏంటంటే రెండు కూడా నష్టం జరిగిన తర్వాతనే మేల్కొన్నాయి.
ఉగ్రవాదంపై ఇప్పుడు అమెరికా యుద్ధం చేస్తుంది గాని ఒకప్పుడు తన అవసరాల కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది అమెరికా దేశమే. ఇలా శత్రుదేశాలను అణిచివేసేందుకు, తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలను తొక్కి పారేసేందుకు అమెరికా ఎంచుకున్న ఉగ్రవాదం ఎత్తుగడ చివరికి ఆ దేశం కంటినే పొడిచింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి జరిగినప్పుడు, అల్ ఖైదా యుద్ధ విమానాలతో అమెరికాలో అల్లకల్లోలం సృష్టించినప్పుడు ప్రపంచం యావత్తు దిగ్భ్రాంతి చెందింది.. మరోవైపు అమెరికాకు ఇలా జరగాలని మాట కూడా వినిపించింది. ఒసామా బిన్ లాడెన్ అనే ఉగ్రవాదిని తన అవసరాల కోసం పెంచి పోషించింది అమెరికా. చిలి నుంచి మొదలు పెడితే ఇరాక్ వరకు తన మాట వినని అన్ని దేశాలను ఇబ్బంది పెట్టింది. ఒకానొక దశలో అంతర్ యుద్ధాలకు కూడా పాల్పడింది. కానీ అలాంటి అమెరికాను ఒసామా బిన్ లాడెన్ అతలాకుతలం చేశాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని కుప్ప కూల్చాడు. ఆ దెబ్బతో 100 గద్దలను మింగిన కొండనాగు సాదు జంతువు అయినట్టు.. అమెరికా అప్పటినుంచి ఉగ్రవాదం పైన యుద్ధం ప్రకటించింది. కానీ ఇదే దశలో భారత్లో నామమాత్రపు అధినేత ఉన్న ప్రభుత్వాన్ని పెట్టేందుకు పొరుగున ఉన్న పాకిస్తాన్ కు నిధులు ఇవ్వడం ప్రారంభించింది. కానీ ఆ పాకిస్తాన్ ఒసామా బిన్ లాడెన్ కు ఆశ్రయం ఇచ్చింది. చివరికి తన తప్పు తెలుసుకుని అమెరికా లాడెన్ ను పాకిస్థాన్లో హతం చేసింది. అప్పటినుంచి భారత్ తో చెలిమి కోరుకుంటుంది. ఇక అంతకుముందు ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధాలు చేసింది. తన అవసరాలు తీరిన తర్వాత బయటకు వచ్చేసింది. ఫలితంగా ఆ మూడు దేశాలు ఇప్పుడు అంతర్ యుద్ధాలతో ఇబ్బంది పడుతున్నాయి.
ఇక రష్యా కూడా అమెరికా టైపే. కాకపోతే అమెరికా నేరుగా యుద్ధం చేస్తుంది, రష్యా మాత్రం పరోక్షంగా తన పని తాను కానిచ్చేసుకుంటుంది. తన ప్రయోజనాలకు విఘాతం కలిగించే దేశాలపై రష్యా యుద్ధాలు చేసింది. తిరుగుబాటుదారులను అణచివేసింది. 2002లో రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు అని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నది. ముఖ్యంగా రక్షణ రంగంలో అమెరికాకు సవాల్ విసురుతోంది. అలాంటి రష్యా ఉక్రెయిన్ తో యుద్ధం ప్రారంభించిన నాటి నుంచి ఎదురు అన్నదే లేకుండా దూసుకుపోతోంది. అలాంటి రష్యా కు ‘వాగ్నర్’ గ్రూపు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ గ్రూపును 61 సంవత్సరాల యె వెన్జీ ప్రిగోజిన్ నడిపిస్తున్నారు. ఇతడు ఎవరో కాదు పుతిన్ పెంచిన కలుపు మొక్క. ఒకప్పుడు విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఇతడిని బాగా వాడుకున్నాడు. ఉక్రెయిన్ తో యుద్ధం సందర్భంగా వార్నర్ గ్రూపుకు అపరిమితమైన అధికారాలు కట్టబెట్టాడు. దీంతో ప్రిగోజిన్ రెచ్చిపోయాడు. ఉక్రెయిన్ పై మితిమీరిన దౌర్జన్యకాండ కు పాల్పడ్డాడు. అందమైన యువతుల్ని చెరిచాడు. తూర్పు ప్రాంతాన్ని తన బలగాలతో ఆక్రమించాడు. ఇప్పుడు ఏకంగా రష్యాలో అంతర యుద్ధానికి పిలుపునిచ్చాడు. అతడి సైన్యం చేస్తున్న బాంబు దాడులతో ఆ దేశం అట్టుడికి పోతోంది. ప్రజలు ప్రాణ భయంతో ఇతర ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. అయితే ఈ పరిణామంతో పుతిన్ ఒక్కసారిగా కంగుతున్నాడు. మరి వాగ్నర్ గ్రూప్ ఆగడాలకు ఎలా చెక్ పెడతాడో వేచి చూడాల్సి ఉంది.