West Indies Series : టీమిండియా వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళుతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఓటమి తర్వాత భారత జట్టుపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా డబ్లూటిసి ఫైనల్ లో ఓటమి తర్వాత భారత ఆటగాళ్లపై విమర్శలు వెల్లువెత్తాయి. బీసీసీఐపై కూడా తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరిగింది. ఏ నేపథ్యంలో వెస్టిండీస్ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది భారత జట్టు. దీంతో జట్టులో కీలక మార్పులు చేసింది. యువ ఆటగాలను ఈ పర్యటనకు ఎంపిక చేసిన బీసీసీఐ.. రానున్న వన్డే టి20, వన్డే వరల్డ్ కప్ కు సరికొత్త టీమ్ సిద్ధం చేసే దిశగా అడుగులు వేస్తోంది.
West Indies Series : రోహిత్ డ్రాప్.. యశస్వి, గిల్ లకే ఛాన్స్.. విండీస్ సిరీస్ లో కీలక మార్పులు
వన్డే, టి20 వరల్డ్ కప్ లే లక్ష్యంగా భారత జట్టు సిద్ధమవుతోంది. బీసీసీఐ కూడా ఆ దిశగా జట్టును సన్నద్ధం చేస్తోంది. అందులో భాగంగానే వెస్టిండీస్ పర్యటనకు వెళుతున్న భారత జట్టులోకి యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది. జట్టులోకి చేరిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తోపాటు రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్లను సెలెక్టర్లు ఎంపిక చేశారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో దారుణంగా విఫలమైన పూజార ఉమేష్ యాదవ్ లపై వేటు వేసి మరి సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. యశస్వి జట్టులో చేరడంతో ఓపెనింగ్ లో మార్పులు ఖాయంగా కనిపిస్తోంది.
ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ ఆడే అవకాశం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ జట్టు తరఫున ఆడే యశస్వి జైస్వాల్ అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. మంచి టెక్నిక్, అంతకుమించి హిట్టింగ్ తో పరుగులు చేయడం ఈ యువ బ్యాటర్ సొంతం. అయితే వెస్టిండీస్ పర్యటనకు ఈ ఆటగాడిని సెలెక్టర్లు ఎంపిక చేయడంతో టీమ్ కూర్పుపై కొంత ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. రాజస్థాన్ జట్టులో యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా వచ్చి అదరగొడుతున్నాడు. వెస్టిండీస్ పర్యటనలో ఈ యంగ్ గన్ ను ఓపెనర్ గా ఆడిస్తారా..? పుజారా స్థానం నెంబర్ త్రీ లో బరిలోకి దించుతారా..? అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ ఓపెనర్ గా ఆడిస్తే ఎవరిని మిడిల్ ఆర్డర్ కు పంపిస్తారు అన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఓపెనర్ గా ఆడుతున్న రోహిత్ శర్మను మిడిల్ ఆర్డర్ లోకి డంప్ చేస్తారా..? లేక గిల్ వెనక్కి వెళతాడు అన్నది తేలాల్సి ఉంది.
ఓపెనర్ గా రాణించే అవకాశం..
రాజస్థాన్ జట్టులో ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ రాణిస్తున్న నేపథ్యంలో.. అదే స్థానంలో బరిలోకి దించితే మంచి ఫలితాలు రాబట్టే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు నుంచి వినిపిస్తున్న మాట. క్రికెట్ అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. ఈ యువ క్రికెటర్ వేగంగా పరుగులు చేస్తాడు కనుక.. ఓపెనర్ గా బరిలోకి దించితే మంచి ఫలితాలు రాబట్టవచ్చని చెబుతున్నారు. రోహిత్ శర్మను మిడిల్ ఆర్డర్ లోకి దించడం వల్ల బలోపేతం అవుతుందని, గిల్, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తే ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే జట్టు అవసరాలు, పిచ్ పరిస్థితులు, మ్యాచ్ జరిగే రోజు ఉన్న కండిషన్ కు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. చూడాలి భారత జట్టులో చూడదగించుకున్న యశస్వి జైస్వాల్ ఏ స్థాయిలో తన ప్రదర్శన ఇవ్వనున్నాడో.