I married my dog: మానవ జీవితాన్ని కొందరు రొటీన్ గా గడిపితే ఇంకొందరు మాత్రం వైవిధ్యంగా మలుచుకుంటారు. ఎదుటి వారి గురించి అసలు పట్టించుకోరు. ఎవరేమనుకున్నా తాననుకున్నదే చేస్తూ అందరిలో వినూత్నంగా ఆలోచిస్తారు. మానవ జీవితం కోర్కెల పుట్ట. పుర్రకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నారు. అదే కోవలో ఓ మహిళ తాను అనుకున్న దాన్ని చేసి చూపించింది. ఎందరో మాటలు చెబుతారు. కానీ కొందరే చేతల్లో చూపుతారు. ఈమె రెండో కోవకు చెందిన వ్యక్తి. సమాజం ఏమనుకున్నా తనకు సంబంధం లేదు తన మనసుకు నచ్చింది చేస్తానని చెప్పి ఓ శునకాన్న వివాహం చేసుకున్ని చర్చనీయాంశంగా మారింది.
లండన్ కు చెందిన అమండా రోడ్జర్స్ అనే 47 ఏళ్ల మహిళ తన భర్తకు విడాకులిచ్చింది. కొంత కాలం ఒంటరిగానే జీవితం గడిపినా బోరు కొట్టడంతో మళ్లీ పెళ్లి చేసుకోవాలని భావించింది. కానీ ఈషారి మాత్రం మనిసిని కాదు. ఓ శునకాన్ని తోడు చేసుకోవాలని సంక్పల్పించింది. అనుకున్నదే తడవుగా వివాహానికి ఏర్పాట్లు చేసుకుంది. బంధుమిత్రులను పిలిపించుకుని దైవ సాక్షిగా ఒక్కటయ్యారు. దీంతో అందరు ఆశ్చర్యపోయారు. కుక్కను పెళ్లి చేసుకోవడమేమిటని ఆలోచనలో పడిపోయారు.
ఆమె మాత్రం ఎ వరేమనుకున్నా తనకు సంబంధం లేదని తేల్చింది. తన మనసు ఇష్టపడింది అంతే చేశా అని చెప్పింది. గతంలో తన మాజీ భర్తతో ఎన్నో ఇబ్బందులు పడ్డానని ఇప్పుడు కుక్కతో ఎలాంటి బాధలు లేవంది. దీంతో తన కాపురం ముచ్చటగా ఉందని మురిసిపోతోంది. ఏ గొడవలు లేకుండా సజావుగా సాగుతున్న తన కాపురం చూస్తే తనకే ముచ్చటేస్తుందని చెప్పుకొచ్చింది.
Also Read: Women Affire:భర్త కూలీ అని.. హెడ్ కానిస్టేబుల్ తో సంబంధం.. చివరికి..?
2004లో పెళ్లి చేసుకున్న మహిళ ఇప్పటికీ కుక్కతోనే కలిసి ఉంటోంది. కలకాలం కలిసి జీవించాలన్నదే తన అభిమతంగా చెబుతోంది. తన ప్రేమ ఎదుటివారికి విచిత్రంగా తోచినా తనకు మాత్రం బాగానే ఉందని సంతోష పడుతోంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వచ్చినా తనకు ఏమాత్రం పట్టింపు లేదని తేల్చింది.