Free Ration: కేంద్ర ప్రభుత్వం కరోనా కాలం నుంచి ప్రజలకు ఉచిత బియ్యం అందజేస్తోంది. దీంతో ప్రజల ఆకలి తీర్చడమే ధ్యేయంగా ముందుకు కదులుతోంది. ఇందుకు గాను గత నవంబర్ నుంచే ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నా మరోమారు ప్రజలకు ఉచితంగా బియ్యం అందజేసేందుకు నిర్ణయించింది. దీంతో ప్రజల కష్టాలను గుర్తించి వారికి ఆకలి బాధలు తీర్చేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసినా ప్రజలే మాకు న్యాయ నిర్ణేతలంటూ తమ పథకాల పరంపర కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే ఉచిత బియ్యం పంపిణీ చేపడుతోంది.
ఉచిత బియ్యం మరో నాలుగు నెలలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నేడు నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. సగటు పౌరుడి బాధలు పరిగణనలోకి తీసుకుని తమ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పకనే చెబుతోంది. ప్రతి ఇంట్లో ఆహార పదార్థాలకు లోటు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. దీనికి గాను ప్రభుత్వంపై పెనుభారం పడుతున్నా లెక్క చేయడం లేదు. ఫలితంగా ప్రజల కోసం పని చేసేందుకు యోచిస్తోంది.
కరోనా కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఒక్కొక్కరికి రూ. 5 వేల చొప్పున సహాయం చేసి తన ఉదారత చాటుకుంది. బియ్యం కూడా ఉచితంగా అందజేసింది. పేదవాడి ఆకలిని గుర్తించే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా పట్టించుకోలేదు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీలో ఎక్కడ కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూసుకుంటోంది.
Also Read: Telangana: తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనా?
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ట మరింత పెరుగుతోంది. ప్రతిపక్ష పార్టీలు వెనకడుగు వేస్తున్నాయి. అన్ని స్టేట్లలో బీజేపీ ప్రభుత్వాలే ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. మరో నాలుగు నెలల పాటు బియ్యం ఉచితంగా అందించేందుకు నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగినదే.
Also Read: Woman Affire:భర్త కూలీ అని.. హెడ్ కానిస్టేబుల్ తో సంబంధం.. చివరికి..?