Vladimir Putin health rumors: వ్లాదిమిర్ పుతిన్. పరిచయం అక్కరలేని పేరు. రష్యా అధినేత అయిన పుతిన్.. అమెరికాకు, యురోపియన్ యూనియన్‌కు, నాటు దేశాలకు కొరకరాని కొయ్యాలా మారాడు. దీంతో పుతిన్ ఆరోగ్యంపై ఆయన గిట్టని దేశాలు తరచూ ఆలయన ఆరోగ్యంపై వదంతులు ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈసారి ఓ వీడియో రష్యా నుంచే విడుదలైంది. ఇందులో పుతిన్ విరామం లేకుండా దగ్గుతూ కనిపించారు. దీంతో పుతిన్‌కు ఏమైంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీడియోలో మాట్లాడుతూ పుతిన్ దగ్గుతూ కనిపించడం సందేహాలకు తావిస్తోంది. ఇలాంటి వీడియోలు సాధారణంగా బయటకు రావు. కానీ, ఆలస్యంగా గుర్తించిన అధికారులు తర్వాత తొలగించారు. కానీ అప్పటికే వైరల్ అయింది. ఇది జియోపాలిటిక్స్‌లో కొత్త ఊహలకు దారితీసింది.
ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..
పుతిన్ ఇటీవల దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమయంలో పుతిన్ శ్వాస ఆడకపోవడం, విరామాలు పట్టడం వీడియోలో స్పష్టంగా కనిపించాయి. సాధారణంగా ఇలాంటి ఫుటేజ్ బయటపడవు, కానీ లీక్ అయిన తర్వాత వేగంగా వ్యాపించింది. అధికార సర్కిల్స్ తొలగించేందుకు ప్రయత్నించాయి, కానీ డిజిటల్ యుగంలో ఆ ఆపరేషన్ విఫలమైంది.
గతంలో ఊహాగానాలు..
పుతిన్ ఆరోగ్యంపై ఇలాంటి ఊహాగానాలు కొత కాదు. గతంలో పుతిన్‌కు పార్కిన్సన్ వ్యాధి ఉందని, క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని రూమర్లు వచ్చాయి. అలస్కా సందర్శనలో నడక తడబడటం వీడియోలు వైరలయ్యాయి. వెస్ట్రన్ మీడియా ఈ ప్రచారాలను అమెరికా అనుకూలంగా ఉపయోగించుకుంది. పుతిన్ తిరుగుబాటు ఎదుర్కొంటాడని, పాలన బలహీనపడుతుందని ఊహాగానాలు వచ్చాయి.
అంతర్జాతీయ ప్రభావాలు..
ఈ రూమర్లు ఉక్రెయిన్ యుద్ధాన్ని, రష్యన్ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తాయి. పుతిన్ తర్వాత నాయకత్వం ఎలా ఉంటుందనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. యూరప్ భద్రతా వ్యూహాలు, చమురు రహస్యాలు ప్రభావితమవుతాయి. ప్రజాస్వామ్య దేశాల్లో వారసత్వం స్పష్టంగా ఉంటుంది, కానీ రష్యాలో అది రహస్యమే.
వెస్ట్రన్ దేశాలు పుతిన్ బలహీనతలను హైలైట్ చేసి రష్యన్ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాయి. రష్యా ఈ ఊహలను అణచివేస్తూ, పుతిన్ బలాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాలంలో ఇవి జియోపాలిటికల్ సమతుల్యతను మార్చవచ్చు.