Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై క్రూడ్ ఆయిల్ దిగుమతుల విషయంలో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడంపై ఇప్పటికే టారిఫ్‌లు విధించారు. అయినా భారత్ ఆయిల్ దిగుమతులు ఆపడం లేదు. ఆరు నెలలుగా భారత్ రోజుకు 1.8 మిలియన్ బ్యారెళ్లు రష్యా నుంచి తీసుకుంటోంది, మొత్తం దిగుమతుల్లో 35 శాతం ఇక్కడి నుంచే వస్తోంది. దీంతో తాజాగా మరోమారు ట్రంప్ హెచ్చరించారు. దీని వెనుక అమెరికా ఆర్థిక వ్యూహం దాగి ఉంది. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఎత్తుకెళ్లడం కూడా ఇందులో భాగమే.
వెనెజువెలా అరెస్టు వెనుక ఆయిల్ వ్యూహం
ట్రంప్ తాజా వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మాడురోను అరెస్టు చేయించారు. ప్రపంచంలో 1.7 ట్రిలియన్ బ్యారెళ్ల ఆయిల్ స్థిరాంగా ఉండగా, వెనెజువెలాలో 303 బిలియన్ డాలర్ల విలువైన రిజర్వులు ఉన్నాయి. ఈ ఆయిల్‌ను అమెరికా గల్ఫ్ కోస్ట్ రిఫైనరీలు తక్కువ ధరకు స్వాధీనం చేసుకోవాలని లక్ష్యం. ఇప్పటి వరకు షేల్ ఆయిల్‌తో కలిపి రిఫైన్ చేస్తున్నారు, ఇక మార్పు తప్పనిసరి. తక్కువ ధరకు వచ్చే వెనుజులా ఆయిల్‌తో రిఫైన్ చేస్తారు. అమెరికాలో ఉత్పత్తి అయ్యే షెల్ ఆయిల్‌ను అధిక ధరకు భారత్‌కు అంటగట్టాలని చూస్తున్నారు.
భారత్‌పై షేల్ ఆయిల్ ఒత్తిడి
చైనాకు తర్వాత భారత్ ప్రపంచంలో రెండో పెద్ద ఆయిల్ దిగుమతి దేశం. వెనెజువెలా ఆయిల్ అమెరికాలోకి వెళ్తే, అక్కడి షేల్ ఆయిల్‌ను భారత్ కొనాలని ట్రంప్ ఒత్తిడి తీసుకుంటున్నారు. తాత్కాలిక అధ్యక్షురాలు ముచాడో కూడా అమెరికా ప్రతిపాదనలు తిరస్కరిస్తున్నారు. 17.3 ట్రిలియన్ డాలర్ల ఆస్తి కోసం అమెరికా దీర్ఘకాల పోరాటానికి సిద్ధమవుతోంది.
భారత్ ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటూ అమెరికాపై ఆధారపడడం తగ్గిస్తోంది. గతంలో లిబియా, ఇరాక్, అఫ్గానిస్తాన్‌లో అమెరికా ఇలాంటి వ్యూహాలు విఫలమయ్యాయి. వెనెజువెలా కూడా ఇదే పరిణామం చూపవచ్చు. భారత్ ఆయిల్ సరఫరాలపై ఈ సంఘటన ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.