Political Film Support: హరి హర వీరమల్లు చిత్రాన్ని ఎలాగైనా హిట్ చేయాలని జనసేన నాయకులు, శ్రేణులు గట్టి ప్రయత్నం చేస్తున్నాయి. కీలక నేతలు హరి హర వీరమల్లు సినిమా చూసేలా ప్రేక్షకులను మోటివేట్ చేయాలని, ముఖ్యంగా అభిమానులు, జనసేన కార్యకర్తలు హరి హర వీరమల్లు సినిమా చూడాలని పిలుపునిచ్చారు. వీలైనంత వరకు హరి హర వీరమల్లు చిత్రానికి నష్టాలు తగ్గించాలనేది వారి తాపత్రయం. హరి హర వీరమల్లు కోసం జనసేన, కూటమి నేతలు ఇంతగా కష్టపడుతుంటే చిరంజీవి, రామ్ చరణ్ ఎందుకు సైలెంట్ అయ్యారనే చర్చ నడుస్తోంది.
ప్రీమియర్స్ లో సత్తా చాటిన హరి హర వీరమల్లు ఫస్ట్ డే రీజనబుల్ వసూళ్లు రాబట్టింది. అయితే డిజాస్టర్ టాక్ తో రెండో రోజే వసూళ్లు దారుణంగా పడిపోయాయి. మెజారిటీ క్రిటిక్స్ హరి హర వీరమల్లుకు నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన నేపథ్యంలో… పవన్ కళ్యాణ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయని ఒప్పుకుంటూనే… ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం. హిందువుల మీద ఓరంగజేబు చేసిన అరాచకాలను బయటపెట్టిన చిత్రం అన్నారు.
Also Read:విజయ్ దేవరకొండ తో దిగిన ఆ ఫోటోలు బయటపెట్టిన రష్మిక… మరచిపోలేని మూమెంట్స్ అంటూ
సినిమా అంటే కేవలం రికార్డులు, వసూళ్లు కాదు. సమాజానికి మంచి చేయాల్సిన మీడియం అన్నారు. హరి హర వీరమల్లు ఫలితాన్ని ముందుగానే అంచనా వేసిన పవన్ గతానికి భిన్నంగా ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్నారు. సినిమాలో కంటెంట్ లేకపోతే ఇవేమీ కాపాడలేవని హరి హర వీరమల్లు రుజువు చేసింది. వీకెండ్ లోనే హరి హర వీరమల్లు వసూళ్లు ఆశాజనకంగా లేవు. మండేను తలచుకుంటేనే మేకర్స్ చెమటలు పట్టే పరిస్థితి నెలకొంది. అంటే వారికి మిగిలి ఉంది ఈ ఆదివారం మాత్రమే. దానికి తోడు నెక్స్ట్ వీక్ కింగ్ డమ్ థియేటర్స్ లోకి వస్తుంది. ఈ సినిమా మీద పాజిటివ్ వైబ్ ఉంది.
పవన్ డై హార్డ్ ఫ్యాన్స్, జనసైనికులు విడుదలైన ఫస్ట్ డే నుండి సోషల్ మీడియాలో యుద్ధం చేస్తున్నారు. ఎలాగైనా సినిమా పట్ల ప్రేక్షకుల్లో పాజిటివిటీ క్రియేట్ చేయాలని డ్యూటీ చేస్తున్నారు. జనసేన కీలక నేతలు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ జనసేన వర్గాలకు పిలుపునిచ్చారు. హరి హర వీరమల్లు సినిమా ప్రతి జన సైనికుడు చూసేలా ప్రచారం చేయాలని వెల్లడించారు. జనసేన, టీడీపీ నేతలు తమ అనుచరులతో పాటు హరి హర వీరమల్లు సినిమా చూస్తున్నారు. సదరు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొందరు నేతలు స్టూడెంట్స్ కి ఫ్రీ షోలు ఏర్పాటు చేశారు.
Also Read: కింగ్ డమ్ ఫస్ట్ రివ్యూ… విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయొచ్చా?
హరి హర వీరమల్లు విజయం కోసం ఇంత డ్రామా నడుస్తుంటే… చిరంజీవి, రామ్ చరణ్ సైలెంట్ గా ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పవన్ కళ్యాణ్ దృష్టిలో హరి హర వీరమల్లు సినిమా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత. టాలీవుడ్ ప్రముఖులు సైతం విధిగా ఈ సినిమాకు ప్రచారం కల్పించాలని పరోక్షంగా ఆయన చెప్పినట్లే. చిరంజీవి, రామ్ చరణ్ కనీసం సోషల్ మీడియాలో హరి హర వీరమల్లు పై పాజిటివ్ కామెంట్స్ చేసినా, కొంత ప్రచారం దక్కుతుంది. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ ని కాపాడాలని పవన్ కళ్యాణ్, ఆయన వర్గం ఇంత కష్టపడుతుంటే మెగా హీరోలు సైలెంట్ గా ఉండటం వెనుక రీజన్ అర్థం కావడం లేదు.