https://oktelugu.com/

Renu Desai : కొత్త  ప్రియుడిని తల్చుకుంటూ రేణు దేశాయ్ ఇంస్టాగ్రామ్ లో షాకింగ్ పోస్ట్..వైరల్ అవుతున్న లేటెస్ట్ కామెంట్స్!

పెడితే రేణు దేశాయ్ రెండవ పెళ్లి ప్రకటించి నిశ్చితార్థం కూడా చేసుకుంది కదా, ఇప్పటి వరకు ఎందుకు రెండవ పెళ్లి చేసుకోలేదు?, అంటే ఆ నిశ్చితార్థం కూడా రద్దు అయ్యిందా?, పెళ్లి క్యాన్సిల్ చూసుకుందా? , ఇలాంటి సందేహాలు అభిమానుల్లో ఎన్నో ఉన్నాయి.

Written By:
  • Vicky
  • , Updated On : November 5, 2024 / 03:35 PM IST

    Renu Desai

    Follow us on

    Renu Desai : పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ కొన్నాళ్ళకు రెండవ పెళ్లి ప్రకటించి, నిశ్చితార్థం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియా లో కొంతమంది ట్రోల్ల్స్ చేసారు, కొంతమంది ఆమెకి శుభాకాంక్షలు కూడా తెలిచేసారు. అయితే అప్పట్లో రేణు దేశాయ్ ట్విట్టర్ లో చాలా యాక్టీవ్ గా ఉండేది. ట్విట్టర్ లో ఏ సెలబ్రిటీ కి అయినా నెగటివిటీ ఉంటుంది. పైగా అప్పట్లో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకుల టాపిక్ ఒక సెన్సేషన్. రేణు దేశాయ్ కూడా ఆ నెగటివిటీ ని ఎదురుకుంటూ ఉండేది. తనపై ఇంత నెగటివిటీ జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నాడు అంటూ అప్పట్లో రేణు దేశాయ్ పలు ఇంటర్వ్యూస్ లో అసంతృప్తి కూడా వ్యక్తం చేసింది. ఇదంతా పక్కన పెడితే రేణు దేశాయ్ నిశ్చితార్థం చేసుకున్న రోజు పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేసాడు. అదే రోజున రేణు దేశాయ్ ట్విట్టర్ లో తన అకౌంట్ తొలగించేసింది.

    అప్పటి నుండి ఆమె ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ అకౌంట్స్ లో యాక్టీవ్ గా ఉండడం మొదలు పెట్టింది. తనకి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఇంస్టాగ్రామ్ ద్వారా ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే రేణు దేశాయ్ రెండవ పెళ్లి ప్రకటించి నిశ్చితార్థం కూడా చేసుకుంది కదా, ఇప్పటి వరకు ఎందుకు రెండవ పెళ్లి చేసుకోలేదు?, అంటే ఆ నిశ్చితార్థం కూడా రద్దు అయ్యిందా?, పెళ్లి క్యాన్సిల్ చూసుకుందా? , ఇలాంటి సందేహాలు అభిమానుల్లో ఎన్నో ఉన్నాయి. రేణు దేశాయ్ కూడా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో కానీ, రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో కానీ తన రెండవ పెళ్లి కి సంబంధించి ప్రస్తావన తీసుకొని రాలేదు. కానీ అభిమానుల్లో మాత్రం ఆ సందేహాలు అలాగే ఉన్నాయి. రీసెంట్ గా ఆమె ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక ఫోటో తెగ వైరల్ గా మారింది.

    ఈ ఫోటో కి ఆమె ‘ప్రియతమా నీవచట కుశలమా..నేనిచట కుశలమే’ అనే ఆడియో ని జత చేసింది. ఆ తర్వాత ఆ ఫోటోకి క్యాప్షన్ పెడుతూ ‘నా వెనుక నీడలా నడుస్తున్న అతను ఎవరో గుర్తు పట్టగలరా’ అని అంటుంది. ఇది ఈమె ఎవరిని ఉద్దేశించి పెట్టింది అనేది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయని ఈమధ్య రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ పోస్టులకు కామెంట్స్ ని ఆఫ్ చేసుకుంది. కానీ దీని గురించి అభిమానులు సోషల్ మీడియా లో పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే రేణు దేశాయ్ ఈమధ్యనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత ఆమె రీసెంట్ గా మరో షూటింగ్ లో పాల్గొన్నది. దీనికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.