Heavy Rainfall In 8 Hours : 8 గంటల్లో భారీ వర్షపాతం నమోదు.. 200లకు పైగా మృతి.. అల్ల కల్లోలం.. ఈ విపత్తుకు కారణం ఏంటంటే?

ఉన్నట్టుండి వర్షాలు పడితే భారీ వరదలు వస్తాయి. అయితే ఏదైనా నది ఉప్పొంగినప్పుడో లేదా డ్యామ్ తెగినప్పుడో ఊహించని వరదలు వస్తాయి. దీంతో భారీ విపత్తు జరిగే అవకాశం ఉంది. కానీ అక్కడ ఒక్కరోజు మొత్తంలో కురవాల్సిన వర్షం కేవలం 8 గంటల్లో కురిసింది.

Written By: Srinivas, Updated On : November 2, 2024 12:35 pm

Heavy rainfall in 8 hours

Follow us on

Heavy Rainfall In 8 Hours: ఉన్నట్టుండి వర్షాలు పడితే భారీ వరదలు వస్తాయి. అయితే ఏదైనా నది ఉప్పొంగినప్పుడో లేదా డ్యామ్ తెగినప్పుడో ఊహించని వరదలు వస్తాయి. దీంతో భారీ విపత్తు జరిగే అవకాశం ఉంది. కానీ అక్కడ ఒక్కరోజు మొత్తంలో కురవాల్సిన వర్షం కేవలం 8 గంటల్లో కురిసింది. దీంతో భారీ విపత్తు ఎదురైతంది. ఈ కారణంగా ఇప్పటి వరకు 200కు పైగా మృతి చెందారు. ఇళ్లలో నుంచి సామన్లు కొట్టుకుపోయాయి. కార్లు చెల్లా చెదురుగా మారిపోయాయి. అత్యంత దీనస్థితిలో ఉన్న ఆ ప్రదేశం వాలెన్సియా.

రెండు రోజులుగా స్పెయిన్ దేశం అల్లకల్లోలంగా మారింది. ఈ దేశంలోని వాలెన్సియా నగరంలోకి ఆకస్మిక వరదలు రావడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. మధ్యధరా సముద్రానికి దరిదాపుల్లో ఉన్న ఈ నగగానికి వరదలు కొత్తేమీ కాదు. కానీ 1973లో వచ్చిన వరదల తరువాత అంతటి కంటే ఎక్కువస్థాయిలో వర్షం కురిసి ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఎదురైంది. ఆ సమయంలో 150 మంది చనిపోయాగా ఇప్పుడు 207 మంది చనిపోయారు.

సాధారణంగా ఈ నగరంలో ఏడాదిపోడవునా వర్షం కురుస్తుంది. కానీ ఇంతటి భారీ స్థాయిలో వరదలు రావడానికి వాతావరణంలో మార్పులు, ప్రభుత్వం నిర్లక్ష్యం అన్న చర్చ సాగుతోంది. మధ్యదరా సముత్ర తీర ప్రాంతాల్లో వేడి గాలులతో పాటు చలి కూడా తోడు కావడంతో మేఘాలు ఏర్పడి భారీ వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. కొందరు శాస్త్రవేత్తలు తెలిపిన ప్రకారం అట్లాంటిక్ మహా సముద్రం, మధ్యధరా సముత్రం మధ్య ఉన్న స్పెయిన్ దేశంలో ఇలాంటి సంఘటన తరుచూ చోటు చేసుకుంటాయి. కానీ ఈ ఏడాది ఆగస్టు నుంచి ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలకు పైగా నమోదవుతోంది. దీనికి తోడు శిలాజ ఇందన కాలుష్యంతో భూతాపం పెరిగి భారీ వర్షాలు కురిశాయని అంటున్నారు

అయితే వరదల నేపథ్యంలో ఇక్కడి ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోవడంతోనే భారీగా ప్రాణ నష్టం జరిగిందన్న చర్చ సాగుతోంది.భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిసినా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లలేదు. దీంతో ఎక్కడి వారు అక్కడే ఉండి నీటి మునిగారు. మరికొందరు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే సక్రమంలో వరదల్లో కొట్టుకుపోయారు. అయితే చాలా ఆలస్యంగా తేరుకున్న అధికారుల సహాయక చర్యలు చేపట్టారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.

వాలెన్సియా నగరంలో దాదాపు 50 లక్షల మందినివసిస్తారు. అయితే తాజాగా సంభవించిన వరదల కారణంగా 207 మంది చనిపోయినట్లు గుర్తించారు. కానీ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే వరదలు తగ్గిన నేపథ్యంలో దీనకర దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. చెల్లా చెదురైన కార్లు.. కొట్టుకుపోయిన ఇంటి సమాగ్రిని చూసి కొందరు చలించిపోతున్నారు. వరదల కారణంగా కొట్టుకు వచ్చిన బురద అలాగే ఉండడంతో జనజీవనం కష్టంగా మారింది.రోడ్లు మొత్తం ధ్వంసం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చాలా ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. ఈ ఏడాదిలో ప్రపంచంలోనే ఇది అత్యంత వరదలు జరిగిన ప్రాంతంగా గుర్తించారు