https://oktelugu.com/

Fish : చేపలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. లేదంటే మీ పని అంతే?

చేపలంటే చాలా మందికి ఇష్టం. వీటిని ఇష్టంగా తినే వారు ఎంత మంది ఉన్నారో? అబ్బో చేపలా? ఛీ అనే వారు కూడా ఉన్నారు. కానీ ఈ చేపలతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొందరు వారంలో ఒకసారి అయినా సరే చేపలను తింటారు. కొందరు మాత్రం వాటిని టేస్ట్ కూడా చేయరు. ఈ లిస్ట్ లో మీరు ఎందులో ఉన్నారు. తింటారా? లేదంటే వాటిని ముట్టుకోరా? అయితే ఆరోగ్యాన్ని అందించే ఆహారాలలో చేపలు ముఖ్యమైనవి అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. చేపలు తరచుగా తినడం వల్ల మన శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయి. అంతేకాదు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని డైటీషియన్లు చెబుతుంటారు. అయితే చేపలు తినే విషయంలో కొంతమంది కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. వీటిని ఎక్కువగా తింటే కూడా అనారోగ్య పాలు కావాల్సి వస్తుంది అంటున్నారు నిపుణులు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 2, 2024 / 12:38 PM IST

    fish

    Follow us on

    Fish : ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలలో చేపలు ఒకటి. చేపలలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు ఉంటాయి. అంతేకాదు శరీరానికి కావలసిన ఇతర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇంత మేలు చేసే చేపలు ఎక్కువగా తినడం వల్ల ఒక్కొక్కసారి అవి హాని కూడా చేస్తాయి. చేపలు కొన్నిసార్లు మన పేగు ఆరోగ్యానికి హానికరంగా మారుతాయి. ఆహారాన్ని జీర్ణం చేస్తే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.

    చేపలు తినడం వల్ల కొందరిలో వాంతులు, వికారం, కడుపునొప్పి వంటి జీర్ణ సమస్యలకు కారణం అవుతాయి. ఇక కొన్ని రకాల చేపలలో అధిక మొత్తంలో జింక్ కూడా ఉంటుంది అంటున్నారు నిపుణులు. దీంతో జీర్ణ సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఇక అటువంటి చేపలను మితంగా తినాలి. ఎక్కువ తింటే ఖచ్చితంగా జీర్ణ సమస్యలు వస్తాయి. ఇక కొన్ని రకాలు చేపలలో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరాన్ని, మలబద్ధకాన్ని కలిగిస్తుంది.

    అయితే సోడియం తక్కువగా ఉన్న చేపలను తినడం లేదా ఉప్పును పరిమితం చేసుకోవడంతో ఈ ఇబ్బందిని అధిగమించవచ్చు చేపలలో మన శరీరానికి కావలసిన ఫైబర్ అంతగా ఉండదు. ఫైబర్ లేకపోవడం కారణంగా ఇందులో చెడు బ్యాక్టీరియా పెరుగుదల జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి చేపలను మరీ ఎక్కువగా తీసుకుంటే ఈ చెడు బ్యాక్టీరియా మన కడుపు పైన ప్రభావాన్ని చూపిస్తుంది.

    కొన్ని రకాల చేపలలో శరీరానికి అనారోగ్యాన్ని కలిగించే ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్తి కొవ్వులు ఉంటాయి కాబట్టి జాగ్రత్త అంటున్నారు నిపుణులు. ఈ కొవ్వులు పేగులలో మంటను పెంచుతాయి. తద్వారా పేగు సిండ్రోమ్ వంటి జీర్ణ సమస్యలకు కారణం అవుతాయి. కాబట్టి చేపలను తినాలనుకునేవారు వాటిని ఎంచుకోవడం జాగ్రత్తగా చేసుకోవాలి.