Rashmika Mandanna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళు సైతం చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోయిన సందర్భాలు సైతం చాలానే ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే మరి కొంతమంది హీరోయిన్లు మాత్రం 20 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో ఎనలేని సేవలను అందిస్తూ టాప్ హీరోయిన్ గా ముందుకు దూసుకెళ్తున్నారు… ఇక ఇలాంటి క్రమంలోనే ‘గీతా గోవిందం’ సినిమాతో తెలుగులో మంచి పాపులారిటిని సంపాదించుకున్న రష్మిక మందాన సైతం ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా వెలుగొందుతుంది.
Also Read: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
రీసెంట్ గా ఆమె విజయ్ దేవరకొండ ని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే…అయితే ఆమె తన కెరీర్లో చాలా సినిమాలను చేసి మంచి పాపులారిటిని సంపాదించుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియాలో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతుండడం విశేషం…ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన సినిమాల్లో తను నటించి గొప్ప గుర్తింపును సంపాదించుకుంది.
ఏ హీరోయిన్ కి దక్కని క్రేజ్ ను తను తెచ్చుకుంది. ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోని తను తన ఓన్ బ్రదర్ల ఫీల్ అవుతూ ఉంటుందట. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే న్యాచురల్ స్టార్ నాని గా తెలుస్తుంది. వీళ్ళ కాంబినేషన్లో ‘దేవ్ దాస్’ అనే సినిమా వచ్చింది. అప్పటినుంచి నానితో మంచి పరిచయం ఏర్పడటం అలాగే తను మంచి ఫ్రెండ్ గా ఉండడమే కాకుండా ఒక బ్రదర్ ల తనను ట్రీట్ చేస్తూ ఉంటుందట…
అందుకే సినిమా ఇండస్ట్రీలో రష్మిక కి సైతం ఒక బ్రదర్ ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి… మరి ఇదంతా చూసినా కొంతమంది జనాలు నిజంగా ఇండస్ట్రీ లో ఉన్న నటీనటులు మధ్య ఇలాంటి హెల్దీ రిలేషన్ షిప్ ఉంటే చాలా మంచిదని కూడా చెబుతున్నారు… ఇక ఇప్పటివరకు ఇండస్ట్రీలో చాలామంది మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉందని వాళ్ళు ఇండస్ట్రీలో ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ సర్వైవల్ అవుతున్నారని మరి కొంతమంది చెబుతుండడం విశేషం…
