Homeఅంతర్జాతీయంYunus Government Bangladesh: యూనస్‌ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత.. బంగ్లాదేశ్‌లో మరో సంక్షోభం తప్పదా?

Yunus Government Bangladesh: యూనస్‌ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత.. బంగ్లాదేశ్‌లో మరో సంక్షోభం తప్పదా?

Yunus Government Bangladesh: రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్‌ నిరసనలతో అట్టుడికింది. షేక్‌ హసీనా ప్రభుత్వం రిజర్వేషన్ల విజయంలో తీసుకున్న నిర్ణయం దేశంలో అగ్గి పుట్టించింది. పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు చెలరేగాయి. చివరకు షేక్‌ హసీనా పదవి వదలి దేశం నుంచి పారిపోవాల్సి వచ్చింది. తర్వాత మహ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే యూనస్‌ కూడా దేశాన్ని గొప్పగా ఏమీ చేలకపోగా, సంక్షోభంవైపు తీసుకెళ్తున్నాడు. ఆయన విధానాలతో విసిగిపోయిన ప్రజలు మళ్లీ పోరుబాట పడుతున్నారు. దీంతో మళ్లీ సంక్షోభం తప్పదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఉద్యోగుల నిరసన..
బంగ్లాదేశ్‌ తాత్కాలిక అధ్యక్షుడు మహ్మద్‌ యూనస్‌ నివాసం ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు నిరసనకు దిగారు. 9వ జాతీయ వేతన సంఘం అమలుకు డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో ఈ నిరసనలు ఆందోళన కలిగిస్తున్నాయి. యవత కూడా నిరసనలకు దిగితే పరిస్థితి మళ్లీ చేయి దాటే ప్రమాదం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రజల మద్దతులు లేని యూనస్‌..
యూనస్‌ ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదు. ఆయన ప్రజాస్వామికంగా ఎన్నిక కాలేదు. ఇక షేక్‌ హసీనా తర్వాత తలెత్తిన సమస్యలను పరిష్కరించడంలోనూ యూనస్‌ ప్రభుత్వం విఫలమైంది. తరచూ బంగ్లాదేశ్‌లో అల్లర్లు జరుగుతున్నాయి. మైనారిటీలపై దాడులు పెరుగుతున్నాయి. ఉగ్రవాద శక్తులు బలపడుతున్నాయి. పాకిస్తాన్, చైనా వైపు మొగ్గు చూపుతోంది. క్రీడల్లోనూ రాజకీయ ప్రభావం కనిపిస్తోంది.

పెరుగుతున్న భారత వ్యతిరేకత..
భారత్‌ యూనస్‌ను గుర్తించకపోవడం బంగ్లాదేశ్‌తో ఉద్రిక్తతలకు కారణం. భారత వ్యతిరేక శక్తులకు యూనస్‌ మద్దతు ఇస్తున్నారు. ఖైదీల విడుదల చేశారు. దీంతో బంగ్లాదేశ్‌ మరో పాకిస్తాన్‌గా మారుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇది భారత్‌తో సంబంధాలను మరింత దెబ్బతీస్తోంది.

ఉద్యోగుల నిరసనలు ప్రభుత్వ వ్యతిరేకత కాకపోయినా, పరిపాలన బలహీనతను బహిర్గతం చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఈ కదలికలు రాజకీయ మలుపులకు దారితీస్తాయి. భారత్‌తో సంబంధాలు మెరుగుపడాలంటే స్థిర ప్రభుత్వం అవసరం.

Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News