Homeఆంధ్రప్రదేశ్‌Visakhapatnam: విశాఖకు కేంద్రం గుడ్ న్యూస్..

Visakhapatnam: విశాఖకు కేంద్రం గుడ్ న్యూస్..

Visakhapatnam: విశాఖకు( Visakhapatnam) మరో గుడ్ న్యూస్ అందింది. ఇప్పటికే పెద్ద ఎత్తున దిగ్గజా ఐటీ సంస్థలు వస్తున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అవుతోంది. ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖలో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రిని మెడికల్ కాలేజీ గా అప్ గ్రేడ్ చేయనుంది. వైద్య విద్యతో పాటు ప్రజారోగ్య సేవలను విస్తరించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఈఎస్ఐ ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా మార్చడానికి కేంద్రం కసరత్తు చేస్తున్న క్రమంలో.. విశాఖ ఈఎస్ఐ ఆసుపత్రికి ఈ అవకాశం లభించింది.

* కేంద్రం స్పష్టం..
దేశవ్యాప్తంగా ఈఎస్ఐ ఆసుపత్రులను( ESI hospitals ) మెడికల్ కాలేజీలు గా మార్చే ప్రక్రియ ప్రారంభం అయింది. విశాఖ ఈఎస్ఐ ఆసుపత్రికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేస్తే.. తాము తక్షణ చర్యలు ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈఎస్ఐ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియను ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టింది. ప్రస్తుతం సిబ్బంది, నిర్వహణ ఖర్చులు, ఇతర కీలక అంశాలపై కేంద్రంతో చర్చలు సాగుతున్నాయి. ఈ అప్ గ్రేడేషన్ పనుల కోసం జనవరిలో కేంద్ర ప్రభుత్వ బృందం విశాఖలోని ఈఎస్ఐ ఆసుపత్రిని సందర్శించింది.

* ఎంతో ప్రయోజనం..
విశాఖ నగరం విస్తరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు అవుతున్నాయి. అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. ఇలా కార్మికులతో పాటు ఉద్యోగులు ఈఎస్ఐ ఆసుపత్రి పై ఆధారపడతారు. ప్రస్తుతం 20 పడకలతో కొనసాగుతోంది ఈ ఆసుపత్రి. మెడికల్ కాలేజీ గా మారడంతో విశాఖ నగరంలో.. వైద్యవృత్తి చేయాలనుకునే వారికి కొంత వెసులుబాటు దక్కుతుంది. కార్మిక వర్గాల వారికి ఉపశమనం కూడా కలుగుతుంది. కేవలం ఇది మాత్రమే కాదు. షీలా నగర్ లో 400 పడకలతో మరో అత్యాధునిక యేసయ్య ఆసుపత్రి నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతుంది. ఇది కూడా విశాఖ నగర ప్రజలతో పాటు ఉత్తరాంధ్రవాసులకు శుభవార్తె..

Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.