Global Oil Crisis 2026: ప్రపంచంలో చమురు సంక్షోభం రాబోతోందా అంటే అవుననే అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇప్పటికే ఆర్మూజ్ జల సంధి మూసివేతతో ఆయిల్ ధరలకు రెక్కొలొచ్చాయి. పాకిస్తాన్లో పెట్రోల్ ధర రూ.50 పెరిగింది. ఇక భారత్‌లో గ్యాస్ ధర రూ.60 నుంచి రూ.110 వరకు పెరిగింది. ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ వార్ నాలుగు వారాలకుపైగా కొనసాగే అవకాశం ఉండడంతో చైనా, జపాప్, బంగ్లాదేశ్‌తోపాటు యురోపియన్ యూనియన్ దేశాలు కూడా పాకిస్తాన్, భారత్ బాటలో పయనించే అవకాశం కనిపిస్తోంది.
Also Read: విజయ్-త్రిషల ప్రేమకి ‘విక్రమ్-జ్యోతిక’లే కారణమా? ఆసక్తికరమైన కథనం!
ఉత్పత్తి నిలిపివేసిన కువైట్..
ఇరాన్ యుద్ధం కారణంగా ఆయిల్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. మరోవైపు ఇరాన్ దాడులతో సౌదీ అరేబియా, బహ్రెయిన్‌లోని ఆయిల్ ఉత్పత్తి కేంద్రాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఆ దేశాల్లో ఉత్పత్తి ఆగిపోయింది. యుద్ధం 14 దేశాలకు విస్తరించింది. ఈ తరుణంలో కువైట్ చమురు ఉత్పత్తి, ఎగుమతులను తాత్కాలికంగా ఆపేసింది. కువైట్ తీరంలో ఇరాన్ ట్యాంకర్‌పై దాడి జరగడంతో చములు లీక్ అయింది. దీంతో ఉత్పత్తి నిలిపివేసినట్లు ఆ దేశం ప్రకటించింది. ట్యాంకర్ పేలుడుతో సముద్రంలో చమురు వ్యాపించింది. పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.
5వ అతిపెద్ద దేశం..
ఆయిల్ ఉత్పత్తి దేశాల కూటమి ఒపెక్‌లో కువైట్ 5వ అతిపెద్ద ఉత్పత్తిదారు. నిత్యం 2.6 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు శుద్ధీకరణ యూనిట్లను కూడా ఆపేసింది. పరిస్థితులు స్థిరపడితే తిరిగి ప్రారంభిస్తామని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (కేపీసీ) ప్రకటించింది.
ఈ దేశాల్లోనూ నిలిపివేత..
ఖతర్, ఇరాక్ ఉత్పత్తి పూర్తిగా ఆపాయి. యూఏఈ నిలిపివేసింది. హార్ముజ్ మీదుగా రోజుకు 170 నౌకలు ప్రయాణించాల్సి ఉండగా, ఇప్పుడు కేవల రెండు మూడు మాత్రమే వెళ్తున్నాయి. చైనా డీజిల్, గాసోలిన్ ఎగుమతులు ఆపమని రిఫైనరీలకు సూచించింది.
యుద్ధం కొనసాగితే మరిన్ని దేశాలు ఆయిల్ ఉత్పత్తి నిలిపవేసే ప్రమాదం ఉంది. ఆయిల్ ఉత్పత్తి, రవాణా నిలిచిపోవడంతో చమురు ధరలు బ్యారెల్‌కు 150 డాలర్లకు చేరే అవకాశం ఉంది. దీంతో అనేక దేశాల్లో ఆయిల్ ధరలు పెరగనున్నాయి. ఆసియా శుద్ధీకరణ కేంద్రాలు ఆధారపడిన గల్ఫ్ దేశాల చర్యలు సంక్షోభానికి దారితీస్తాయి.