https://oktelugu.com/

America : అమెరికా దిగువ సభలో హిందువులు.. అగ్రరాజ్యంలో సరికొత్త చరిత్ర!

అగ్రరాజ్యం అమెరికాకు త్వరలో కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ 47వ అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో అడుగు పెట్టనున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో అమెరికాలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 5, 2025 / 09:00 PM IST

    Indian American Hindus

    Follow us on

    America :  అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగిసింది. త్వరలో కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌లో అడుగుపెట్టనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నిక కాగానే తీసుకునే నిర్ణయాలపై ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ తరుణంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలతోపాటే జరిగిన పార్లమెంటు దిగువ సభ ఎన్నికల్లో గెలిచిన నలుగురు హిందువులు శుక్రవారం(జనవరి 3న) సభలో అడుగు పెట్టారు. అమెరికాలో మైనారిటీ వర్గమైన హిందువులో ఒకేసారి నలుగురు దిగువ సభకు ఎన్నిక కావడం ఆదేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఆరుగురు భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు ఈసారి దిగువ సభ ఎన్నికల్లో గెలవగా వారిలో నలుగురు హిందువులు కావడం విశేషం. డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థుల్లో క్రైస్తవేత, యూదు యేతర మత విశ్వాసం ఉన్న వ్యక్తులు కేవలం 14 మంది మాత్రమే. వీరిలో హిందువులు నలుగురు, ముస్లింలు నలుగురు, బౌద్ధులు ముగ్గురు, ఏ మతం ఆచరించనివారు ముగ్గురు ఉన్నారు. హిందువుల్లో సుహాస్‌ సుబ్రహ్మణ్యం, రాజా కృష్ణమూర్తి, సుబ్రహ్మణ్యం, రోఖన్నా, శ్రీథానేదార్‌ తాజా ఎన్నికల్లో విజయం సాధించారు.

    వీరు కూడా..
    ఇక ఈ ఎన్నికల్లో భారతీయ మూలాలున్న మహిళా అమెరికన్‌ ప్రమీలా జయపాల్‌ తన మతం ఏమిటనేది పేర్కొనలేదు. భారతీయ మూలాలున్న మరో సీనియర్‌ దిగువ సభ సీనియర్‌ సభ్యుడు డాక్టర అమీ బెరా దేవుడు ఒక్కడే అనే విశ్వాసాన్ని నమ్ముతానని తెలిపారు. 12 ఏళ్ల క్రితం తాను దిగుబ సభలో ప్రమాణం చేసేటప్పుడు తాను ఒక్కడినే భారతీయ అమెనక్‌ను అని, ఇప్పుడు మా బలం ఆరుకు పెరిగింది అని వెల్లడించారు. మొత్తం సభ్యుల్లో క్రైస్తవులదే మెజారిటీకాగా, 31 మంది(6 శాతం) యూదులు ఉన్నారు. గెలిచిన రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థుల్లో 98 శాతం మంది, డెమొక్రటిక్‌ పార్టీ సభ్యుల్లో 75 శాతం మంది క్రైస్తవులు ఉన్నారు.

    స్పీకర్‌గా మళ్లీ మైక్‌
    ఇక అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌గా 52 ఏళ్ల మైక్‌ జాన్సన్‌ మరోమారు ఎన్నికయ్యారు. శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో కేవలం మూడు స్వల్ప ఓట్ల మెజారిటీతో నెగ్గారు. వందేళ్ల చరిత్రలో ఇంత తక్కువ మెజారిటీతో గెలిచిన స్పీకర్‌గా మైక్‌ చరిత్ర సృష్టించారు. రిపబ్లికన్‌ పార్టీ తరఫున మైక్‌ బరిలో దిగారు. దిగువ సభలో 219 మంది రిపబ్లికన్లు ఉండగా, 215 మంది డెమొక్రాట్లు ఉన్నారు. మైక్‌కు అనుకూలంగా 2018 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 215 మంది ఓటేశారు. డెమొక్రటిక్‌ సభ్యుడు హకీమ్‌ జెఫ్రీస్‌ సైతం మైక్‌కే ఓటు వేయడం విశేషం. స్వల్ప మెజారిటీతో నెగ్గిన మైక్‌ వెంటనే స్పీకర్‌గా ప్రమాణం చేశారు.