Jasprit Bumrah బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోల్పోయిన తర్వాత.. విమర్శలు మొదలయ్యాయి. గొప్ప గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ… ఆస్ట్రేలియాను నిలువరించలేకపోయారనే ఆరోపణలు పెరిగిపోయాయి. అయితే ఇంతటి విపత్కర పరిస్థితిలోనూ టీమ్ ఇండియాకు సాంత్వన కలిగించిన ఆటగాడు ఒకడున్నాడు.. అతని పేరు బుమ్రా. ఒకప్పటి జహీర్ ఖాన్ లాగా జట్టుకు వెన్నెముకలాగా నిలిచాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జట్టుకు అవసరమైన ప్రతి సందర్భంలోనూ వికెట్ పడగొట్టాడు. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ధారాళంగా పరుగులు తీస్తున్నప్పుడు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బుమ్రా వైపు చూశాడంటే అతిశయోక్తి కాదు. సిడ్ని టెస్ట్ మినహా మిగతా అన్ని మ్యాచ్లలో బుమ్రా అదరగొట్టాడు. వికెట్ల మీద వికెట్లు పడగొట్టాడు.. ఆస్ట్రేలియా మైదానాలపై తన విశ్వరూపం చూపించాడు. ఏ ఒక్క ఆటగాడిని వదిలిపెట్టకుండా తన బౌలింగ్ ప్రతాపాన్ని చూపించాడు. హెడ్ నుంచి మొదలు పెడితే స్టార్కు వరకు ప్రతి ఒక్కరు బుమ్రా బౌలింగ్ కు భయపడ్డవారే.
32 వికెట్లు పడగొట్టాడు
పెర్త్ టెస్ట్ నుంచి మొదలుపెడితే మెల్ బోర్న్ మ్యాచ్ వరకు బుమ్రా తన మ్యాజికల్ స్పెల్ ప్రదర్శించాడు. జట్టుకు అవసరమైన ప్రతి సందర్భంలోనూ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. అతడు తన బౌలింగ్ నైపుణ్యంతో ఏకంగా 32 వికెట్లు సొంతం చేసుకున్నాడు. కాకలు తీరిన బ్యాటర్లను సైతం తన బౌలింగ్ మాయాజాలంతో పెవిలియన్ పంపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లు కమిన్స్, స్టార్క్, బోలాండ్ సాధించలేని ఘనతను.. బుమ్రా చేసి చూపించాడు. బోర్డర్ గవాస్కర్ సిరీస్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. సిరీస్ కోల్పోయి తీవ్రమైన నిర్వేదంలో ఉన్న టీమ్ ఇండియాకు.. తన మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ద్వారా కాస్తలో కాస్త ఉపశమనాన్ని ఇచ్చాడు. ఆస్ట్రేలియా మైదానాలు సాధ్యమైనంతవరకు పేస్ బౌలర్లకు అనుకూలిస్తాయి. అరుదైన సందర్భాల్లో మాత్రమే స్పిన్నర్లు పండగ చేసుకుంటారు. అయితే మైదానాలపై తగిన తేమ ఉన్న నేపథ్యంలో.. తనకు అనుకూలంగా మలుచుకున్నాడు బుమ్రా. వికెట్ల వేటను ఇష్టానుసారంగా చేపట్టాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 32 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే సిరీస్లో అత్యంత తక్కువ బంతుల్లో 200 వికెట్లు పడగొట్టిన నాలుగవ బౌలర్ గా బుమ్రా ఆవిర్భవించాడు. అంతేకాదు కెప్టెన్ గా పెర్త్ టెస్టులో టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు.. 32 వికెట్లు తీసిన నేపథ్యంలో ఆస్ట్రేలియా మీడియా బుమ్రా ను కీర్తిస్తూ కథనాలను ప్రచురించడం విశేషం. అతడు గొప్పగా బౌలింగ్ చేశాడంటూ వివరించడం ఇక్కడ గమనార్హం..