Iran And India: ఇరాన్..ఇప్పుడు ఈ దేశం అమెరికా,పశ్చిమ యూరప్ దేశాలకు కొరకరాని కొయ్య. ఈ దేశం పేరు చెబితేనే ఆయా దేశాలు అగ్గి మీద గుగ్గిలం అవుతుంటాయి. పశ్చిమాసియాలో ఇరాన్ ఆధిపత్యాన్ని ఎప్పటికప్పుడు అణచి వేసేందుకు అమెరికా,దాని మిత్ర పక్షాలు వేయని ఎత్తులంటూ లేవు. వాటి మిత్ర దేశం ఇజ్రాయిల్ చేత ఇరాన్ ను అదుపులో పెట్టే యత్నం చేస్తుంటుంది. అందులో భాగంగానే ఇటీవల లెబనాన్ లోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయిల్ డ్రోన్లతో మెరుపు దాడి చేయడం…ఆ వెంటనే ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లతో విరుచుకుపడడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు మరింతగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్ చేసి దాడులను సమర్థవంతంగా ఇజ్రాయిన్, అమెరికా,దాని మిత్ర పక్ష దేశాలు తిప్పికొట్టగల్గాయి. దీంతో ఇజ్రాయిల్,అమెరికా చేస్తున్న అటాక్స్ తో చిరెత్తిపోయిన ఇరాన్ సూయాజ్ కెనాల్ ద్వారా వెళ్లే ఇజ్రాయిల్ కు సంబంధించిన నౌకను బంధించడం..అందులో పనిచేస్తున్న వర్కర్స్ భారతీయులు కావడం దౌత్యపరంగా మనకు ఇబ్బందికరమైన పరిస్థితులను తెచ్చిపెట్టింది.
కరవమంటే కప్పకు కోపం..విడమంటే పాముకు కోపం అన్నట్లు నౌక ఇజ్రాయిల్ ది కావడంతో ఆ నౌకను విడిచిపెట్టమని చెప్పలేని పరిస్థితి ఇండియాది. అందులోనూ అటు ఇరాన్ ఇటు ఇజ్రాయిల్ కూడా భారత్ కు మిత్ర పక్ష దేశాలే. ఇరాన్-భారత్ భాగస్వామ్యంతో ఆ దేశంలోని దాదర్ లో సీ పోర్టును ఇండియా నిర్మిస్తోంది. ఈనేపథ్యం లోనే ఇరాన్ కు వ్యతిరేకంగా మన దేశం ఒత్తిడి చేయలేని సంకట స్థితి నెలకొంది. అంతేకాక ఇటీవల మన దాయాది పాకిస్థాన్ ఇరాన్‌కు మధ్య సఖ్యత కుదరడం కూడా ఇరాన్-భారత్ దౌత్య వ్యవహారంపై ప్రభావం ఉంటుందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేశారు. ఇలాంటి తరుణంలో ఇరాన్ రెవల్యూసరీ గార్డ్ కార్ప్స్ చెరలో చిక్కుపోయిన ఇజ్రాయిల్ కు చెందిన నౌకలోని భారతీయులను మన దేశం ఎలా విడిపించుకుంటుందని ప్రపంచ దేశాలన్ని ప్రధాని మోడీ వైపు చూశాయి. ఇలాంటప్పుడు ఇరాన్‌తో భారత్ ఎలాంటి వ్యవహార శైలిని ప్రదర్శిస్తోందోనని అన్ని దేశాలు ఆసక్తిని కనబర్చాయి.
ఈనేపథ్యంలోనే రంగంలోకి దిగిన ప్రధాని నరేంద్ర మోడీ,భారత విదేశాంగ శాఖ బారతీయులను విడిపించుకు నేందుకు జరిపిన చర్చలు ఫలప్రదం కావడం ప్రపంచ దేశాల ప్రశంసలు పొందేందుకు కారణమైంది. అయితే మొదట నౌకలోని ఒక మహిళను విడుదల చేసేందుకు అంగీకరించిన ఇరాన్ తదనంతరం మన దేశ దౌత్యానికి కన్విన్స్ అయి మరో ఐదుగురు బారతీయ సిబ్బందిని వదిలేయడం ఇండియాకు దౌత్యపరంగా ప్రశంసలు లభించినట్లైంది. ఇరాన్ బద్ధ శత్రువైన ఇజ్రాయిల్ నౌకలో పనిచేస్తున్న భారతీయుల సైతం ప్రధాని మోడీ విడిపించుకోగల్గడం ఆయన అద్బుతమైన ఫారన్ పాలసీకి నిదర్శమని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. ఒక దేశం రెండు బద్ద విరోధులైన దేశాలతో సఖ్యతను కొనసాగిస్తూ…తనకు ఆపద వచ్చినప్పుడు తన పౌరుల భద్రతకు పెద్దపీట వేస్తూ..రక్షించుకోగల్గడం చాలా గొప్ప విషయమని..ఇందులో ప్రధాని నరేంద్ర మోడీకి వందకు వెయ్యిశాతం మార్కులు వేయొచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .