Homeవింతలు-విశేషాలుHusband And Wife: నీయవ్వ తగ్గేదేలే.. భార్య నుంచి కూడా అద్దె వసూలు చేస్తున్న భర్త..!

Husband And Wife: నీయవ్వ తగ్గేదేలే.. భార్య నుంచి కూడా అద్దె వసూలు చేస్తున్న భర్త..!

Husband And Wife: సాధారణంగా ఏ వ్యక్తి అయినా భార్యను బాగా చూసుకోవాలనుకుంటాడు. ఆమె అడిగిన చిన్న చిన్న కోరికలు తీర్చడంతోపాటు ఆమెను సంతోషపెట్టడానికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లు కూడా ఇస్తుంటారు. ఇక ధనవంతులైన భర్తలు అయితే.. భార్య అడగడమే ఆలస్యం అన్నట్లుగా ఆమె అడిగినవన్నీ ఇస్తుంటారు. అయితే.. ఇక్కడ ఓ భర్త ఏకంగా భార్య నుంచే అద్దె వసూలు చేస్తూ ఎంజయ్‌ చేస్తున్నాడు. దీంతో ఆమె తన బాధను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. తన కోరికలు తీర్చకపోగా, తననుంచే డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు అవసరమైన చిన్న చిన్న బిల్లులు కూడా చెల్లించడం లేదని పేర్కొంది. భర్త వింత ప్రవర్తనతో విసిగిపోయి తన బాధను నెటిజన్లతో పంచుకుంది.

ఏం జరుగుతోంది..
ఓరిగామి టోర్బీ అనే మహిళ.. ఓ సంపన్నుడిని పెళ్లి చేసుకుంది. తన జీవితమంతా సంతోషంగా ఉంటుందని వైవాహిక జీవితంపై కలలు కన్నది. కానీ, ఆమె కలలన్నీ కల్లలయ్యాయి. తనకు అవసరమైన చిన్న ఖర్చు కూడా తనే పెట్టుకుంటోంది. ఉద్యోగం చేస్తోంది. పెళ్లయి 18 ఏళ్లు అయినా భర్త ఆమెకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. ఆమె కోసం ఖర్చు చేయడం లేదని తెలిపింది. ఉద్యోగం నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకుని వచ్చిన డబ్బులతో ఎంజాయ్‌ చేస్తున్నట్లు వెల్లడించింది.

భర్త అభిరుచుల గురించి..
ఇక తన భర్త అభిరుచులను కూడా ఓరిగామి టోర్బి నెటిజన్లతో పంచుకుంది. తనకు కావాల్సిన వన్నీ సమకూర్చుకుంటున్న భర్త తనకు మాత్రం ఏమీ చేయడం లేదని వెల్లడించింది. డబ్బంతా తన ఆనందం కోసం ఖర్చు చేసుకుంటున్నాడని పేర్కొంది. ఇక తాను ఇంట్లో ఉంటుంన్నందుకు తనతో 17 ఏళ్లుగా అద్దె కూడా కట్టించుకుంటున్నాడని తెలిపింది.

స్పందిస్తున్న నెటిజన్లు..
ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తున్నారు. లైక్స్‌ కోసం ఇలాంటివి కూడా చేస్తున్నారా అని కొందరు.. 18 ఏళ్లుగా ఏం చేశావనికొందరు.. మరికొందరు ఎన్నాళ్లు భరిస్తావు అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఓరిగామి టోర్బీ భర్తను అభినందిస్తున్నాడు. వాడ్రా అసలు మగాడు అని భార్యా బాధితులు కామెంట్‌ చేస్తున్నారు. నీయవ్వ తగ్గేదేలే.. అని ఇంకొందరు పేర్కొన్నారు. పెళ్లాం కోసం అందరూ ఖర్చు పెడుతుంటారు.. కానీ, పెళ్లాం అవసరాలకు ఆమెతోనే డబ్బులు పెట్టించే వాడికే ఓ రేంజ్‌ ఉంటుంది అని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version