Facebook: ఫేస్ బుక్.. ఈ యాప్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన జీవితాల్లో భాగం అయ్యింది ఈ ఫేస్ బుక్. చిన్న పిల్లాడి దగ్గరి నుంచి ముసలివాళ్ల వరకు దాదాపు ప్రతీ ఒక్కరూ ఈ ఫేస్ బుక్ యాప్‌ను వాడుతున్నారు. దీనిని ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫేస్ బుక్‌లో 2.85 బిలియన్స్ అకౌంట్స్ ను కలిగి ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో ఈ ఫేస్ బుక్ మొదటి స్థానంలో ఉంది. ఇండియాలో కూడా యాప్ మొదటి స్థానంలోనే ఉంది. ఇప్పటి వరకు 340 మిలియన్స్ అకౌంట్స్ ఉన్నాయని ఫేస్ బుక్ సంస్థ అధికారికంగా తెలిపింది. తమకు ఇండియా అతిపెద్ద మార్కెట్ అని ఫేస్ బుక్ చాలా సార్లు ప్రకటించింది.

ఏమిటీ ఫేస్ బుక్..
ఫేస్ బుక్ ఒక సోషల్ నెట్ వర్కింగ్ ప్లాట్ ఫామ్. దీనిలో ప్రతీ ఒక్కరూ అకౌంట్ కలిగి ఉండవచ్చు. మనలో భావాలను ఈ వేదిక ద్వారా ప్రపంచానికి తెలియజేయవచ్చు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదివే మార్క్ జుకర్ బర్గ్ తన స్నేహితులతో కలిసి ఈ ప్లాట్ ఫామ్ ను తయారు చేశారు. దీనిని 2004 ఫిబ్రవరి 4న ఫేస్ బుక్ అనే పేరుతో రిలీజ్ చేశారు. దీంతో ఇది సోషల్ మీడియా రంగంలో పెను మార్పులను తీసుకొచ్చింది. ఎప్పటికప్పుడు దానిని అప్ డేట్ చేస్తూ వస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇది కేవలం సోషల్ మీడియా ప్లాట్‌ఫాంగానే కాక, మెసెంజింగ్, బిజినెస్, మార్కెటింగ్ యాప్‌గా కూడా ఉపయోగపడుతోంది.
అందరికీ చేరువైన ఫేస్‌బుక్..
ఏళ్లుగా ఫేస్ బుక్ పేరు అందరి నోళ్లలో నానుతోంది. ఫేస్ బుక్ అంటే ఇప్పుడు తెలియని వారు లేరు. మానవ జీవితంలో జరిగే ఏ అకేషన్‌ను అయినా ఇందులో పంచుకుంటున్నారు. మనిషి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు జరిగే అన్ని పనులు ఇందులో షేర్ చేసుకుంటున్నాడు. దీంతో పాటు ఎన్నో సమస్యలను ఈ వేధిక ద్వారా ప్రభుత్వం దృష్టికి, సమాజం దృష్టికి తీసుకొస్తున్నారు. ఎన్నో సామాజిక సమస్యల చర్చలకు ఈ ఫేస్ బుక్ వేధిక అవుతోంది. అందకే ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, ఇతర ముఖ్య అధికారులు ఈ ఫేస్ బుక్‌లో అకౌంట్ లు ఓపెన్ చేసుకున్నారు. రాజకీయ నాయకులు ఈ ఫేస్ బుక్ ద్వారా తమ పాపులారిటీని పెంచుకుంటున్నారు. తము చేసే పనులను, తమ అభిప్రాయాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. దీంతో ఈ యాప్ ప్రస్తుతం ఫుల్ క్రేజ్ లో ఉంది.
Also Read: ఐఐటీ జమ్మూలో నాన్ టీచింగ్ జాబ్స్.. రూ.2 లక్షల వేతనంతో?
నిజంగానే పేరు మారుతోందా ?
ప్రజల జీవితాల్లో భాగమైన ఫేస్ బుక్ పేరు మార్పుపై ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఇక ఫేస్ బుక్ పేరు ఉండదని, దాని పేరు మెటావర్స్ (metaverse) అని మారబోతున్నదని అంటున్నారు. దీనిపై ప్రజల్లో చాలా గందరగోళం నెలకొంది. అయితే ఈ విషయంపై ప్రముఖ సాంకేతిక నిపుణులు శ్రీధర్ నల్లమోతు తన ఫేస్ బుక్ వాల్ పై క్లారిటీ ఇచ్చారు. ఫేస్ బుక్ అనే ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్ ఫాం facebook అనే పేరుతోనే కొనసాగుతుందని తెలిపారు. కానీ ఆ సంస్థ భవిష్యత్తు లక్షాలను దృష్టిలో ఉంచుకొని, వర్చువల్ రియాలిటీ, మరియు augmented రియాలిటీ ప్రాజెక్టులను దృష్టిలో పెట్టుకొని metaverse అనే సంస్థ పేరుగా అది మారుబోతుందని చెప్పారు. అంటే ఇక మీదట ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసినప్పుడు పవర్డ్ బై ఫేస్‌బుక్ అనే పదం బదులు metaverse అని కనిపిస్తుంది. ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాలు, భవిష్యత్ ప్రణాళిక విషయంలో ఈ మార్పు కీలక పాత్రం పోషిస్తుందని తెలిపారు. ప్రస్తుతం మనం వాడుతున్న ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ యాప్‌లు కూడా ఫేస్ బుక్ సంస్థ కు చెందిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి ఫేస్ బుక్ యాప్ మారబోదని, కేవలం ఆ సంస్థ పేరు మారబోతుందని తెలుస్తోంది.
Also Read: ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ చాట్ చేయవచ్చు.. ఎలా అంటే?