Top-5 donors in India: దేశంలో కోటీశ్వరులు పెరిగిపోతున్నారు. సంపద కొందరి చేతుల్లోనే ఉండిపోతోంది. దీంతో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. పేదవాడు పేదవాడిగానే ఉంటున్నాడు. కోటీశ్వరులు మరింత ఎక్కువవుతున్నారు. సంపాదనలో వారు దూసుకుపోతున్నారు. ఫలితంగా దేశం పేదవారితోనే నిండిపోతోంది. సంపన్నులు సంపదతో తులతూగుతున్నారు. రిలయన్స్, విప్రో, బిర్లా, టాటా, అదాని వంటి సంస్థలు సంపాదనలో అగ్రస్థానాలు ఆక్రమిస్తున్నాయి. దీంతో డబ్బు సంపాదన వారికి వెన్నతో పెట్టిన విద్యగా మారుతోంది.

దయాగుణంలో కూడా వారు ముందే ఉంటున్నారు. వారి సంపాదనలో కొంత భాగాన్ని దానం చేస్తూ వారిలో కూడా మానవత్వం ఉందని నిరూపిస్తున్నారు. తద్వారా సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నాయి. విప్రో కంపెనీ అధినేత అజీమ్ ప్రేమజ్ జీ తన సంపాదనలో రూ.9713 కోట్లు దాతృత్వానికే కేటాయిస్తున్నారు. సగటున రోజుకు రూ.27 కోట్లు దానం చేస్తున్నారు. దీంతో ఆయనలో కూడా మానవత్వం మిగిలే ఉందని నిరూపిస్తున్నారు.
హెచ్ సీఎల్ చైర్మన్ శివనాడర్ రూ.1263 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ రూ.577 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. కుమార మంగళం బిర్లా రూ.377 కోట్లతో నాలుగో స్థానం పొందారు. దేశంలో సంపన్నుల్లో రెండో వాడైన గౌతమ్ అదానీ రూ.130 కోట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచారు. ఇన్ఫోసిస్ అధినేత నందన్ నీలేకని రూ.183 కోట్లతో ఐదో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: ఐఐటీ జమ్మూలో నాన్ టీచింగ్ జాబ్స్.. రూ.2 లక్షల వేతనంతో?
సంపన్నులు తమ సంపాదనలో కొంత భాగాన్ని దానం చేస్తూ తమకు సైతం దానగుణం ఉందని నిరూపిస్తున్నారు. తమ సంపాదనలో కొంత భాగం దేశ సేవకు ఉపయోగపడుతున్నందుకు సంతోషంగా ఉందని చెబుతున్నారు. ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతలే మిన్న అనే మదర్ థెరిసా సూక్తిని నిజం చేస్తున్నారు. సమాజ హితం కోసం తమ సంపాదన ఉపయోగిస్తూ సమాజాభివృద్ధికి పాటుపడుతున్నారు.
Also Read: MODI Pakistan: పాకిస్తాన్ ప్రధానితో మోదీని ఎందుకు పోల్చాలి..?