Hawaii island : ఓ ఐదేళ్ల క్రితం ఓ కంపెనీ తాను తయారు చేస్తున్న కుంకుమ ప్రచారానికి ఓ ప్రకటన షూట్‌చేసింది. ఆ వీడియోలో కనిపించే వారంతా బ్లాక్ అండ్ వైట్‌లో కనిపిస్తే.. మహిళలు ధరించిన కుంకుమ మాత్రం ఎర్రగా కనిపిస్తుంది. తమ కంపెనీ కుంకుమ ప్రకాశిస్తుంది అనే కోణంలో ఈ యాడ్ రూపొందించారు. ఇపుపడు హవాయి ద్వీపం చూస్తే కుంకుమ కంపెనీ ప్రకటనే గుర్తొస్తుంది. అమెరికాలోని హవాయి దీవిలో ఏర్పడిన భీకర కార్చిచ్చు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 100 ఏళ్లలోనే అత్యంత తీవ్రమైన ప్రకృతి విపత్తు ధాటికి లహైనా రిసార్టు నగరం బూడిద దిబ్బగా మారింది. వేగంగా వ్యాపించిన మంటల ధాటికి దాదాపు అన్ని ఇళ్లు మాడి మసవ్వగా.. వంద మందికి పైనే ప్రాణాలు కోల్పోయారు. కానీ, ఓ భవనానికి మాత్రం రవ్వంత నష్టం కూడా జరగలేదు. ఊరంతా కార్చిచ్చుకు బూడిదైతే.. కుంకుమ యాడ్‌లో లాగా.. ఆ భవనం మాత్రం చెక్కుచెదరలేదు.
రెడ్ రూఫ్ భవంతి..
బూడిద దిబ్బల మధ్య… లహైనా నగరంలో ఫ్రంట్ స్ట్రీట్‌లో కుప్పకూలిన భవన శిథిలాల మధ్య చెక్కుచెదరకుండా ఉన్న ఓ రెడ్ రూఫ్ భవంతి ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే ఫొటోషాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, దీనిపై ఆ భవన యజమాని ట్రిప్ మిలికిన్ స్పందిస్తూ.. అది నిజమైన ఫొటోనే అని చెప్పారు. అదే సమయంలో కార్చిచ్చు నుంచి తమ భవనం సురక్షితంగా ఉండటానికి కారణాలను కూడా వివరించారు.
కాలిపోయింది అనుకున్నాం..
కార్చిచ్చు సంభవించినప్పుడు మిలికన్, ఆయన భార్య మసాచుసెట్స్‌కు విహారయాత్రకు వెళ్లారు. ప్రమాదం వార్త తెలియగానే మా ఇల్లు కూడా పూర్తిగా కాలిపోయి ఉంటుందని భావించారు. కానీ మరుసటి రోజు ఏరియల్ ఫుటేజ్‌లను చూస్తే మా ఇంటికి ఏం కాలేదని తెలిసి మేం కూడా ఆశ్చర్యపోయాం. దీనికి స్పష్టమైన కారణం తెలియనప్పటికీ.. పైకప్పు వల్లే భవనానికి ఏం కాలేదని భావిస్తున్నామని తెలిపారు.
రెండేళ్ల క్రితమే కొనుగోలు..
100 ఏళ్ల పురాతనమైన ఈ భవంతిని మిలికన్ దంపతులు రెండేళ్ల క్రితమే కొనుగోలు చేశారట. పాతకాలం ఇల్లే అయినా ఎలాంటి మరమ్మతుల అవసరం లేకపోయింది. దీంతో దానికి కొన్ని హంగులు జోడించాలనుకున్నాం. అలా ఆస్ఫాల్ట్ రూఫ్‌ను తొలగించి దాని స్థానం భారీ బరువుండే మెటల్‌తో పైకప్పును ఏర్పాటు చేయించారు. ఇంటి చుట్టూ పచ్చికను తొలగించి బండతో ఫ్లోరింగ్ వేయిచారు. అందరి మాదిరిగానే అది చెక్కతో నిర్మించిన ఇల్లే. అయితే, ప్రమాద సమయంలో నిప్పు కణికలు పైకప్పుపై పడటంతో చాలా ఇళ్లు కాలి బూడిదయ్యాయి. కానీ మిలికన్ ఇంటిపై మెటల్ రూఫ్ ఉండటంతో నష్టం తప్పింది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Everything on the island of hawaii was burnt but only one house was not burnt
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com