Hero : ఒకప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు మంచి సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ వచ్చారు. అందువల్లే ఇండస్ట్రీలో మంచి గౌరవం దక్కడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగిన వాళ్ళుగా గుర్తింపును సంపాదించుకున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది సక్సెస్ ఫుల్ హీరోలు ఉన్నారు. ఇక అందులో కొంతమంది సూపర్ స్టార్ గా మారుతుంటే మరి కొంత మంది మాత్రం సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీ నుంచి ఫేయిడ్ ఔట్ దశకు దగ్గర్లో ఉన్న హీరోలు వాళ్ళ కెరియర్ ను బిల్డ్ చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికి అందులో కొంతమందికి మంచి బ్రేక్ త్రూ దొరుకుతుంటే మరి కొంతమందికి మాత్రం సరైన సక్సెస్ లేక వెనకబడిపోతున్నారు… ఇక బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోగా మంచి ఇమేజ్ ను సంపాదించుకున్న డినో మోరియా తనకి కెరియర్ లో 23 సినిమాలు చేస్తే అందులో ఒకే ఒక సక్సెస్ ని సాధించి 22 డిజాస్టర్లను మూట గట్టుకున్నాడు. ఇక ఆ దెబ్బతో సినిమా ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ ఔట్ అవ్వడమే కాకుండా సపరేట్ గా కొన్ని బిజినెస్ లను చేపడుతూ ముందుకు సాగుతున్నాడు… మరి డినో మోరియా సినిమాలు ప్లాప్ అవ్వడానికి కారణం ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…

1999వ సంవత్సరంలో ‘ప్యార్ మే కబీ కబీ’ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ సినిమా డిజాస్టర్ ని ముడగట్టుకుంది. ఇక 2002 లో రాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే బిపాసా బసు ఇందులో నటించడంతో ఈ సినిమాని 5 కోట్లు పెట్టి సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా విజయాన్ని సాధించి 37 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. దాంతో డినో మోరియా ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు…
ఇక ఈ సక్సెస్ తర్వాత ఆయనకు వరుసగా విజయాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ ఆయన చేసిన వరుస సినిమాలు డిజాస్టర్ల బాట పట్టడంతో ఆయన ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఔట్ డేటెడ్ స్టోరీలను ఎంచుకొని సినిమాలు చేయడం వల్లే ఆయనకి వరుసగా ప్లాపులు వచ్చాయి…ఇక ఆయన ఇండస్ట్రీ నుంచి పక్కకు తప్పుకొని బిజినెస్ ను స్థాపించి అందులో సక్సెస్ సాధిస్తూ వచ్చాడు. 2012 వ సంవత్సరంలో క్రికెట్ ఐకాన్ అయిన ఎమ్మెస్ ధోనితో కలిసి కూల్ మాల్ అనే మార్చండైజింగ్ కంపినీని స్థాపించాడు…
2018 వ సంవత్సరంలో మిథల్ లోదా, రాహుల్ జైన్లతో కలిసి కోల్డ్ ఫ్రెస్డ్ జ్యూస్ బ్రాండ్ అయిన ది ఫ్రెష్ ప్రెస్ ను స్థాపించారు… ఇది బాగా సక్సెస్ అవ్వడంతో ఇండియా వైడ్ గా 36 బ్రాంచ్ లను స్టార్ట్ చేశారు. దాంతో భారీ ఆదాయాన్ని సంపాదిస్తూ ఆయన ఇప్పుడు దాదాపు 156 కోట్ల నికర ఆస్తులను పోగేసినట్టుగా తెలుస్తోంది…