Sukumar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరు అందుకోలేని విజయాలను సొంతం చేసుకుంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్… ప్రస్తుతం పాన్ ఇండియాలో కూడా తన హవాను విస్తరిస్తూ ముందుకు సాగుతున్న ఈ స్టార్ హీరో తొందర్లోనే ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ సినిమా పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…
పుష్ప 2 సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించిన అల్లు అర్జున్ ప్రస్తుతం 1800 కోట్ల కలెక్షన్లను రాబట్టి మరింత దూకుడును పెంచుతూ భారీ వసూళ్లను రాబట్టే దిశగా ముందుకు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఈ సినిమా మరో రెండు వందల కోట్ల కలెక్షన్స్ ని రాబడితే 2000 కోట్ల మార్కును అందుకున్న సినిమాగా నిలుస్తుంది. ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ ను సాధించిన సినిమాగా కూడా ఈ సినిమా అవతరిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంతటి గొప్ప విజయాన్ని సాధించిన పుష్ప 2 సినిమా గురించి ప్రతి ఒక్కరు చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ రోజున సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఇక శ్రీతేజ్ అనే పిల్లవాడు సైతం హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం ఈ వివాదం హాట్ టాపిక్ గా మారడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ విషయం మీద చాలా ఫైర్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇక వీళ్లను ఆదుకోవడానికి చాలామంది ముందుకు వచ్చారు.
ఇక ఏది ఏమైనా కూడా ఈ వివాదం ఎవరి వల్ల జరిగింది దీనికి కారణం ఎవరు అనే ధోరణిలో అయితే కొన్ని చర్చలు నడుస్తున్నాయి.మరి ఏది ఏమైనా కూడా సినిమా యూనిట్ నుంచి రీసెంట్ గా ‘దమ్ముంటే పట్టుకోరా షేకావత్’ పట్టుకుంటే వదిలేస్తే సిండికేటు అంటూ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో చెప్పిన డైలాగ్ అయితే యూట్యూబ్ లో పెట్టారు.
ఇప్పుడు రేవతి ఘటనలో ఇటు అల్లు అర్జునునికి, అటు పోలీస్ ఆఫీసర్స్ కి మధ్య ఒక భారీ యుద్ధమే నడుస్తుంది.మరి ఇలాంటి సందర్భంలో ఇలాంటి డైలాగును రిలీజ్ చేయడం పట్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు యావత్ ఇండియా లో ఉన్న ప్రతి ఒక్కరూ దానిని ఖండించారు. ఇక మొత్తానికైతే టీ సిరీస్ వాళ్ళు ఆ వీడియోని తొలగించినట్టుగా తెలుస్తోంది.
ఇక ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమా డైరెక్టర్ అయిన సుకుమార్ చొరవ తీసుకొని ఆ డైలాగు ఇప్పుడు రిలీజ్ చేస్తే అది జనాల్లో నెగిటివ్ ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుందనే ఉద్దేశ్యం తోనే సుకుమార్ టీ సీరీస్ వాళ్లతో మాట్లాడి దాన్ని యూట్యూబ్ నుంచి తీయించినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ మీద వస్తున్న నెగెటివిటీని తగ్గించుకొని ఆయన మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది…