Elon Musk: టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ ఇటీవల ప్రపంచ జనాభా క్షీణతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది “ప్రపంచంలోని అతి పెద్ద సమస్య” అంటూ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. ఎలాన్ మస్క్ “టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ” అకౌంట్ ద్వారా షేర్ చేసిన ఓ గ్రాఫ్‌ను రీట్వీట్ చేశారు. ఇది 2018 – 2100 మధ్య ప్రపంచంలోని కొన్ని ప్రధాన దేశాల జనాభాలో కీలక మార్పును చూపుతుంది. అంటే వచ్చే 76 ఏళ్లలో భారత్‌తో సహా ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశాల జనాభా వేగంగా తగ్గుతుంది. చైనా, భారతదేశం, నైజీరియా, యుఎస్, ఇండోనేషియా , పాకిస్తాన్‌తో సహా అనేక దేశాల జనాభా మార్పులపై గ్రాఫ్ డేటాను కలిగి ఉంది. ‘జనాభా పతనం మానవాళికి అతి పెద్ద ముప్పు… ఎలోన్ మస్క్’ అని అని టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ తన పోస్ట్‌లో పేర్కొంది. ఈ ప్రకటనతో తన అంగీకారాన్ని వ్యక్తం చేస్తూ మస్క్ కేవలం “అవును” అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.
ప్రపంచ జనాభా క్షీణత వెనుక కారణాలు
ప్రపంచం జనాభా క్షీణత దిశగా పయనిస్తోందని నిపుణులు చాలా కాలంగా సూచిస్తూ వస్తున్నారు.ఈ ధోరణి ఏ దేశాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది అనే దానిపై చర్చ ఇప్పటికీ కొనసాగుతోంది. జనాభా క్షీణతకు ప్రధాన కారణాలు సంతానోత్పత్తి రేటు క్షీణత, వలసలు, వృద్ధాప్య జనాభా. అనేక దేశాల్లో ఒక మహిళ కనే సగటు పిల్లల సంఖ్య దారుణంగా పడిపోయింది. స్థిరమైన జనాభాను నిర్వహించడానికి అవసరమైన దాని కంటే తక్కువగా ఉంది. 2023లో ఇంగ్లండ్, వేల్స్‌లో ఒక మహిళకు సగటు పిల్లల సంఖ్య 1.44కి పడిపోతుంది. ఇది ఇప్పటివరకు కనిష్ట రేటు. ప్రపంచవ్యాప్తంగా కూడా 1963లో ఒక మహిళకు సగటు పిల్లల సంఖ్య 5.3గా ఉంది. అది నేడు సగానికి పైగా పడిపోయింది.
భవిష్యత్తు అవకాశాలు
2020లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం.. 2018 నుండి భారతదేశం , చైనా జనాభా భారీగా తగ్గుతుంది. 2100 నాటికి భారతదేశ జనాభా 1.1 బిలియన్లకు తగ్గుతుంది. చైనా జనాభా దాదాపు 731.9 మిలియన్లకు పడిపోయే అవకాశం ఉంది. అంటే చైనా 731 మిలియన్ల ప్రజల కొరతను ఎదుర్కొంటుంది. నైజీరియా జనాభా 2100 నాటికి 790.1 మిలియన్లకు చేరుతుందని అంచనా వేసింది. ఇది ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారింది.
అమెరికా, కెనడా , ఆస్ట్రేలియాలో భర్తీ
అమెరికా, సంతానోత్పత్తి రేటు భర్తీ స్థాయి కంటే తక్కువగా ఉంది. ఇది 2100 సంవత్సరం వరకు నాల్గవ అతిపెద్ద దేశంగా తన స్థానాన్ని కొనసాగించగలదు. సానుకూల నెట్ మైగ్రేషన్ దీనికి కారణం. అదేవిధంగా, కెనడా, ఆస్ట్రేలియా కూడా వలసల ద్వారా తమ జనాభాను స్థిరంగా ఉంచుకోగలవు.
ఎలోన్ మస్క్ హెచ్చరిక
ఎలోన్ మస్క్ చాలా కాలంగా జనాభా క్షీణతకు వ్యతిరేకంగా హెచ్చరిస్తున్నారు. “జనాభా పతనం రాబోతుంది” అని ఆయన గతంలో చెప్పారు. ఇది మానవాళికి అతిపెద్ద ముప్పుగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య సంరక్షణ, సామాజిక నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
— Elon Musk (@elonmusk) January 7, 2025