Homeట్రెండింగ్ న్యూస్HMPV Virus : హైదరాబాద్‌లో చైనా వైరస్‌ కలకలం.. గత నెలలోనే 11 కేసులు.. చికిత్స...

HMPV Virus : హైదరాబాద్‌లో చైనా వైరస్‌ కలకలం.. గత నెలలోనే 11 కేసులు.. చికిత్స తర్వాత అందరూ డిశ్చార్జ్‌!

HMPV Virus : ఎక్కడో చైనా(Chaina)లో పుట్టిన వైరస్‌ మనదాకా ఎందుకు వస్తుందిలే అని 2019లో కరోనాను ప్రపంచ దేశాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ, కేవలమ మూడు నెలల వ్యవధిలోనే కరోనా.. ప్రపంచమంతా విస్తరించింది. చిన్న పెద్ద, ధనిక పేద అన్న తేడా లేకుండా అందరినీ పలకరించింది. ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్నవారు తట్టుకున్నారు. భయం, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారు మరణించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. అన్నిరంగాలపైనా కోవిడ్‌(Covid) ప్రభావం పడింది. గత పరిణామాల నేపథ్యంలో చైనాలో కొత్తగా పుట్టిన హెచ్‌ఎంపీవీ వైరస్‌పై ప్రపంచమంతా అప్రమత్తమైంది. అయితే డబ్ల్యూహెచ్‌వో మాత్రం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే.. భారత్‌లోనూ హెచ్‌ఎంపీవీ కేసులు వెలుగు చూస్తున్నాయి. బెంగళూరు, గుజరాత్‌లో కేసులు బయటపడ్డాయి. వైరస్‌ సోకిన చిన్నారులు చికిత్స పొందుతున్నారు. వీరు చైనాకు వెళ్లకున్నా వైరస్‌ బారిన పడడంపై పరిశోధన చేశారు. అయతే ఈ హెచ్‌ఎంపీవీ వైరస్‌ 20 ఏళ్ల క్రితం నాటిదే అని వైద్యులు గుర్తించారు. మళ్లీ యాక్టివ్‌ అయినట్లు పేర్కొంటున్నారు. జాగ్రత్తలు పాటిస్తే భయపడాల్సిన పనిలేదని సూచిస్తున్నారు.

గత నెలలోనే హైదరాబాద్‌లో..
ఇదిలా ఉంటే.. ఈ హెచ్‌ఎంపీవీ కేసులు హైదరాబాద్‌(Hyderabad) లో గత నెలలోనే నమోదైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దేశంలో 7 కేసులు నమోదయ్యాయి. అయితే తెలంగాణలోని హైదరాబాద్‌లో గత నెలలో 11 మంది ఈ వైరస్‌ బారిన పడినట్లు సమాచారం. పలువురు వైరల్‌ ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతుండడంతో హైదరాబాద్‌లోని మని మైక్రోబయాలజికల్‌ ల్యాబోరేటరీ 258 మందికి శ్వాసకోశ పరీక్షలు నిర్వహించింది. వాటిలో 205 మందికి గువ శ్వాస కోశ సమస్యలు ఉన్నట్లు నిర్దారించింది. 11 శాంపిల్స్‌లో హెచ్‌ఎంపీవీ పాజిటివ్‌ అని తేలిందని ల్యాబోరేటనీ ప్రకటించింది.

అందరూ డిశ్చార్జ్‌
ఇదిలా ఉంటే.. గతనెలలో వైరస్‌ సోకినవారంతా చికిత్స తర్వాత కోలుకున్నారని అధికారులు తెలిపారు. హెచ్‌ఎంపీవీ వైరస్‌ కొత్తదేం కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. సుదీర్ఘకాలంగా హెచ్‌ఎంపీవీ వైరస్‌ భారత్‌లో ఉందని వైద్య పరిశోధనా మండలి(ICMR) ప్రకటించింది. కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version