ట్రంప్‌కు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పంచ్‌ : ఆయన ఖాతాలపై నిషేధం

అమెరికాలో గడిచిన 24 గంటల్లో తలెత్తిన అల్లర్లతో ప్రపంచవ్యాప్తంగా ఆ దేశం పరువు గంగలో కలిసింది. ఈ నేపథ్యంలో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ప్రపంచమంతా దుమ్మెత్తి పోస్తోంది. ట్రంప్ జాతీయవాదాన్ని రెచ్చగొట్టి ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. తాజాగా ఫేస్ బుక్ కూడా ట్రంప్ కు ఊహించని షాకిచ్చింది. ఆయన పోస్టులు అల్లర్లను ప్రోత్సహించే విధంగా ఉన్నాయన్న ఫేస్‌బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్.. ట్రంప్ పై నిషేధాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఈ […]

Written By: Srinivas, Updated On : January 8, 2021 10:28 am
Follow us on


అమెరికాలో గడిచిన 24 గంటల్లో తలెత్తిన అల్లర్లతో ప్రపంచవ్యాప్తంగా ఆ దేశం పరువు గంగలో కలిసింది. ఈ నేపథ్యంలో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ప్రపంచమంతా దుమ్మెత్తి పోస్తోంది. ట్రంప్ జాతీయవాదాన్ని రెచ్చగొట్టి ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. తాజాగా ఫేస్ బుక్ కూడా ట్రంప్ కు ఊహించని షాకిచ్చింది. ఆయన పోస్టులు అల్లర్లను ప్రోత్సహించే విధంగా ఉన్నాయన్న ఫేస్‌బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్.. ట్రంప్ పై నిషేధాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్ వాల్‌పై ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

Also Read: తలొగ్గిన డొనాల్డ్ ట్రంప్.. అధికారం అప్పగింతకు అంగీకారం

ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ట్రంప్‌ ఎట్టకేలకు తన ఓటమిని అంగీకరించారు. బైడెన్‌ను అధ్యక్షుడిగా ఒప్పుకున్నారు. అయితే మరో 12 రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి అధికారికంగా వైదొలగనున్న ట్రంప్‌కు ఎదురుగాలి వీస్తోంది. వరుస సమస్యలు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అమెరికాలోని క్యాపిటల్‌ భవనంలో హింసాత్మక ఘటనలకు తెరలేపారు. దీంతో అధికార మార్పిడి పూర్తయ్యేవరకు ట్రంప్‌ ఫేస్‌బుక్‌ ఖాతాపై సంస్థ నిషేదించనుంది.

జో బైడెన్‌కు అధికారం అప్పగించే విషయంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల్లో తమ ఫేస్‌బుక్‌ను ట్రంప్‌ ఉపయోగించుకున్న తీరును తప్పుబట్టారు. క్యాపిటల్‌ భవనంలో ఆయన మద్దతుదారుల చర్యలను ఖండించడానికి బదులుగా వారి చర్యలను సమర్థించేలా ఫేస్‌బుక్‌ను వాడుకోవడం అమెరికా ప్రజలనే కాదు.. ప్రపంచాన్ని కలవరపరిచిందని పేర్కొన్నారు. హింసను ప్రేరేపించే ఉద్దేశంతో చేసినట్లు ఉన్న ట్రంప్‌ ప్రకటనల్ని తాము ఇప్పటికే తొలగించామని జుకర్‌బర్గ్‌ తెలిపారు. మరోసారి అలా జరగకుండా ఉండేందుకు ట్రంప్‌ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలపై విధించిన 24 గంటల నిషేధాన్ని మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్లు ప్రకటన చేశారు జుకర్‌బర్గ్‌. ట్విట్టర్ కూడా ఇదే దారిలో పయనించనుంది.

Also Read: ఫోన్ పే యూజర్లకు శుభవార్త.. రూ.149కే ఇన్సూరెన్స్ పాలసీ..?

అటు డొనాల్డ్‌ ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఇరాక్‌లోని బాగ్దాద్‌ న్యాయస్థానం అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. తమ దేశానికి చెందిన పారామిలిటరీ కమాండర్‌ అబు అల్‌ ముహందిస్‌ హత్య కేసు విచారణలో భాగంగా ట్రంప్‌ అరెస్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఇరాక్‌ శిక్షాస్మృతిలోని ఆర్టికల్‌ 406 ప్రకారమే ట్రంప్‌ను అరెస్టు చేసేందుకు వారెంట్‌ జారీ చేసినట్లు బాగ్దాద్‌ న్యాయస్థానం తెలిపింది. గతేడాది జనవరి 3న ఇరాన్‌ మేజర్‌ జనరల్‌ ఖాసిం సులేమానీ, ఇరాక్‌ పారా మిలిటరీ కమాండర్‌ అబు అల్‌ ముహందిస్‌లు యూఎస్‌ డ్రోన్‌ దాడిలో మరణించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాలతో వారిని హత్య చేసినట్లు తెలియడంతో ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు ట్రంప్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. ఇంకా ఈ మిగిలిన రోజుల్లో ట్రంప్‌ రచ్చ ఎలా ఉండబోతోందో మరింత ఆసక్తికరంగానూ.. భయంకరంగానూ ఉంది.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు