https://oktelugu.com/

North Korea Army: ఉక్రెయిన్‌లో అడుగు పెట్టిన ఉత్తర కొరియా సైన్యం.. తీవ్రంగా స్పందించిన అమెరికా!

రెండేళ్లుగా జరుగుతున్న రష్యా–ఉక్రెయిన్‌ వార్‌లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌కు ఇన్నాళ్లు వివిధ దేశాలు మద్దతు తెలిపాయి. కానీ, తొలిసారి రష్యాకు ఓ దేశం మద్దతు ప్రకటించింది. తమ సైన్యాన్ని యద్ధంలోకి దించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 31, 2024 / 02:08 PM IST

    North Korea Army

    Follow us on

    North Korea Army: అమెరికా మద్దతుతో రష్యాపై ఎదురు తిరిగిన ఉక్రెయిన్‌పై రష్యా రెండేళ్ల క్రితం సైనిక చర్య చేపట్టింది. దీంతో అమెరికా మద్దతులో ఉక్రెయిన్‌ కూడా రష్యా దాడులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే తీవ్రంగా నష్టం జరిగినా ఉక్రెయిన్‌ ఎక్కడా రష్యాకు తలొగ్గడం లేదు. అమెరికా, బ్రిటన్‌తోపాటు నాటో దేశాల సహకారంతో రష్యాపైనా దాడులు చేస్తోంది. నాలుగైదు నెలల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం రెండేళ్లయినా ఆగడంలేదు. రెండు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో ఇటీవల రష్యాలో పర్యటించిన అమెరికా బద్ధ శత్రువు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు సాయం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఇటీవలే 12 వేల మంది సైన్యాన్ని రష్యాకు పంపించారు. తాజాగా ఉక్రెయిన్‌సైన్యం యుద్ధరంగంలోకి దగింది. దీనిపై అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా స్పందించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం చేసే ఉత్తర కొరియా సైనికుల శవాలు బ్యాగుల్లో తిరిగి ఉత్తర కొరియాకు వెళ్తాయని హెచ్చరించింది. రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా దలాలు ఉక్రెయినేలోకి ప్రవేశిస్తే కచ్చితంగా ఉత్తర కొరియా సైనికుల శవాలను ఉత్తర కొరియాకు పార్శిల్‌ చేస్తాం. ప్రమాదకరమైన చర్యలకు పాల్పడడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఈ విషయంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌–ఉన్‌కు సూచిస్తున్నాం’ అని ఐక్యరాజ్యసమితిలో యూఎస్‌ డిప్యూటీ రాయబారి రాబర్ట్‌ వుడ్‌ సూచించారు.

    యుద్ధం ఆగేలా లేదు..
    ఇక పరిస్థితులు చూస్తుంటే.. రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. తాజాగా ఇరు దేశాలు మరోసారి పరస్పరం దాడులు, ప్రతిదాడులు చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్‌ ప్రాంతాలపై రష్యా బలగాలు దాడులు చేయగా, అందుకు ప్రతీకారంగా ఉక్రెయిన్‌ పెద్ద సంఖ్యలో డ్రోన్లతో ప్రతిదాడులకు దిగింది. కీవ్‌ సహా పలు ప్రాంతాల్లో రష్యా 62 డ్రోన్లు, ఒక క్షిపిణితో దాడి చేసిందని ఉక్రెయిన్‌ వైమానిక దళం ధ్రువీకరించింది. వీటిలో 50కిపైగా డ్రోన్లను అడ్డుకున్నట్లు తెలిపింది.

    ఉక్రెయిన్‌ గ్రామం స్వాధీనం..
    ఇదిలా ఉంటే.. కీవ్‌లోని ఓ నివాసిత భవనం, కిండర్‌ గార్డెన్‌పై రష్యా డ్రోన్‌ పడిందని వెల్లడించింది. ఈ దాడిలో ఓ చిన్నారి సహా తొమ్మిది మంది గాయపడ్డారని తెలిపింది. ఇందుకు ప్రతీకారంగా రష్యా పశ్చిమ, దక్షిణ భాగాలపై ఉత్తర కొరియా డ్రోన్లతో దాడి చేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. వీటిలో 25 డ్రోన్లు కూల్చినట్లు తెలిపింది. ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌ ప్రాంతంలోని క్రుహ్లా్యకివ్కా గ్రామాన్ని తమ బలగాలు స్వాధీనం చేసుకున్నుట్లు తెలిపింది.

    398 సంస్థలపై ఆంక్షలు
    ఇదిలా ఉండగా ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో రష్యాకు సహకరిస్తున్న 398 సంస్థలపై అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలు విధించింది. రష్యా యుద్ధానికి సహకరించేలా ఉత్పత్తులు సేవలు అందిస్తున్నందు ఆక్షంలు విధించినట్లు తెలిపింది. ఈ జాబితాలో రష్యా, భారత్, చైనా, మరో డజనుకుపైగా ఇతర దేశాలకు చెందిన 398 సంస్థలు ఉన్నాయని తెలిపింది. 274 సంస్థలు రష్యాయు ఆధునిక సాంకేతికతను సరఫరా చేస్తున్నట్లు పేర్కొంది. కొన్ని సంస్థలు ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా ఉపయోగించే ఆయుధాలను నిర్వహించే సైనిక ఉత్పత్తులను తయారు చేసే రష్యా సంస్థలు కూడా ఉన్నాయని తెలిపింది.