Homeఅంతర్జాతీయంElon Musk And Donald Trump: పార్టీలో ఆడి పాడిన ట్రంప్, మస్క్‌.. వీడియో వైరల్‌!

Elon Musk And Donald Trump: పార్టీలో ఆడి పాడిన ట్రంప్, మస్క్‌.. వీడియో వైరల్‌!

Elon Musk And Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్‌ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈమేరు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2025, జనవరి 20న బాధ్యలు చేపట్టనున్నారు. అధికార మార్పిడికి సమయం ఉండడంతో ఆయన తన మంత్రివర్గ కూర్పుపై దృష్టిపెట్టారు. తన గెలుపునకు కృషి ఏసిన, తనకు అండగా నిలిచిన విధేయులకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలోనే మస్క్, వివేక్‌ రామస్వామితోపాటు అనేక మందికి పదవులు ఇచ్చారు. ఇక వైట్‌హౌస్‌ కార్యవర్గం కూర్పుపైనా దృష్టి సారించారు. క్యాబినెట్‌ కార్యవర్గం ఎంపిక కూడా తుది దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన గెలుపు సంబరాల్లో మునిగితేలుతున్నారు. తాజాగా ఓ పార్టీకి మస్క్‌తో కలిసి Ðð ళ్లిన ట్రంప్‌ అక్కడ ఆడిపాడారు. ఆ దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

అందరితో కలిసి పోతూ..
ట్రంప్‌ గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చాలా మందికి దూరంగా ఉండేవారు. కానీ, రెండోసారి ఎన్నికైన తర్వాత ట్రంప్‌ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. మునుపటిలా కాకుండా అందరితో కలిపిసోతున్నారు. ప్రపంచ కుబేరుడు మస్క్‌తో కలిసి సందడి చేస్తున్నారు. పార్టీలకు హాజరవుతున్నారు. ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా ఇద్దరూ కలిసి ఓ పార్టీకి వెల్లిన వీడియోలో ట్రంప్‌ చాలా ఉత్సాహంగా కనిపించారు. ఈ మేరకు వీడియో వైరల్‌ అవుతుండగా అందులో ట్రంప్‌ సతీమణి మొలానియా, కొడుకు భారన్‌ ట్రంప్‌ కూడా ఉన్నారు.

థ్యాంక్స్‌ గివింగ్‌ పార్టీ..
అమెరికాలో అతిపెద్ద పండుగల్లో థ్యాంక్స్‌ గివింగ్‌ ఒకటి. నవంబర 28 అమెరికన్లు థ్యాంక్స్‌ గివింగ్‌ జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఓ పార్టీలో ట్రంప్, మస్క్‌ పాల్గొన్నారు. మార్‌–ఏ–లాగో రిసార్ట్స్‌లో ఈ పార్టీ జరిగింది. ఈ పార్టీలో ఎలాన్‌ మస్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ వై.ఎం.సీ.ఏ పాటకు డ్యాన్స్‌ చేశారు. ఈ సమయంలో ఇద్దరూ ఫుల్‌ జోష్‌గా కనిపించారు. ట్రంప్‌ అయితే మస్క్‌ భుజంపై తట్టి మరి హుషారు చేశారు. టేబుల్‌పై దరువు వేస్తూ కనిపించారు. చేతులు గాల్లోకి ఊపుతూ కూర్చున్న చోటనే రిథమిక్స్‌గా డాన్స్‌ చేశారు. ఇక మరో వీడియోలో మస్క, సిల్వెస్టర్‌ స్టాలిన్‌తో చాట్‌ చేస్తూ కనిపించారు. ఆ ఫ్రేంలో ట్రంప్‌ కూడా ఉన్నా… మరో పనిలో బిజీగా కనిపించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version