Secret Superstar: భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలు మంచి విజయాలను సాధించి ఎక్కువ కలెక్షన్స్ ని రాబడతాయి అనుకోవడం చాలావరకు పొరపాటు… ఒకవేళ ఆ సినిమా కనక తేడా కొడితే ప్రొడ్యూసర్ భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు. కథ బాగుంటే ఆటోమేటిగ్గా సినిమా కూడా బాగా వస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు భారీ బడ్జెట్ తో వచ్చిన చాలా సినిమాలు భారీ వసూళ్లను సాధించాయి. బాహుబలి, దంగల్, కల్కి లాంటి సినిమాలు తమదైన రీతిలో వసూళ్లను రాబట్టడమే కాకుండా పలు రికార్డులను కూడా తిరగరాశాయి. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు భారీ వసూళ్లను రాబట్టడం సహజంగా జరుగుతూనే ఉంటుంది. కానీ ఒక చిన్న సినిమా కేవలం 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా బాహుబలి రికార్డులను సైతం తిరగరాసిందనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఇంతకీ ఆ సినిమా ఏంటి అందులో ఎవరెవరు నటించారనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
2017 వ సంవత్సరంలో అద్వైత్ చందన్ తెరకెక్కించిన చిత్రం ‘సీక్రెట్ సూపర్ స్టార్’… ఈ మూవీ ని కేవలం 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక దాంతో ఈ సినిమా 65 కోట్ల నెట్ ప్రాఫిట్ ను సంపాదించి పెట్టగా 95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. మొత్తానికైతే 65 కోట్ల కలెక్షన్స్ తో ఈ సినిమా భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఇక దానికి తోడుగా ఈ సినిమాని చైనాలో కూడా రిలీజ్ చేశారు. ఇక చైనాలో రిలీజ్ చేయడం వల్ల ఈ సినిమాకి ఎనలేని గుర్తింపు అయితే వచ్చింది. 124 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించగా ఈ సినిమా లాంగ్ రన్ లో 900 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టింది.
దాంతో అప్పటివరకు ఉన్న చాలా పెద్ద సినిమాల రికార్డులను కూడా ఈ సినిమా తిరగరాసిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కేవలం 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిన్న సినిమా ఇంతటి రికార్డులను క్రియేట్ చేయడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…ఇక ఈ సినిమాని అమీర్ ఖాన్ ప్రొడ్యూస్ చేయగా ఈ సినిమాలో తను కూడా ఒక గెస్ట్ రోల్ లో నటించాడు. కేవలం ఈ సినిమాలో అమీర్ ఖాన్ నటించడం వల్ల ఈ సినిమా టాప్ లోకి వెళ్లిపోయిందని చెప్పడం చాలా రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఈ కంటెంట్ ని బేస్ చేసుకొని ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది.
అయితే దంగల్ సినిమా చైనాలో మంచి విజయాన్ని సాధించడంతో ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమా కాబట్టి ఈ సినిమాకి చైనాలో కూడా మంచి ఆదరణ అయితే దక్కింది…ఇక ఇప్పటి వరకు ఇండియాలో వసూళ్ల పరంగా అత్యధిక కలెక్షన్స్ ను సాధించిన సినిమాల్లో స్త్రీ 2 (857 కోట్లు),(పికే 769 కోట్లు), బాహుబలి ది బిగినింగ్ (617 కోట్లు) ఈ రికార్డులన్నింటిని ఈ సినిమా బ్రేక్ చేసిందనే చెప్పాలి… కథలో కంటెంట్ ఉండి దాన్ని విజువల్ గా ఉన్నతమైన స్థాయిలో చెప్పగలిగితే ప్రతి సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…